Jailor Movie : శివ రాజ్ కుమార్, కన్నడ చిత్రసీమలో అతిపెద్ద స్టార్‌లలో ఒకరు. కన్నడ ప్రేక్షకులు ఆయనను ఎంతో ప్రేమిస్తారు. అలానే ఆయన వ్యక్తిత్వం వల్ల ఆయన్ని ఎంతో గౌరవిస్తారు కూడా. అందుకే వారు అతన్ని కన్నడ చక్రవర్తి అని పిలుస్తారు. కానీ అక్కడ అంత క్రేజ్ ఉన్న ఈ హీరో ఇప్పటివరకు ఇతర భాషలలో నటించలేదు. అతని సినిమాలు ఇతర భాషలలోకి డబ్ కూడా చేయబడలేదు. అందుకే మొన్నటి వరకు ఇంత గొప్ప హీరో ఇతర భాషల వారికి దాదాపు పూర్తిగా తెలియకుండా ఉండేవారు. అయితే ఇప్పుడు మాత్రం సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం జైలర్ ఇతర భాషల మార్కెట్లలో ఆయనకు టర్నింగ్ పాయింట్ గా మారింది.
జైలర్‌లో, కేవలం 5 నిమిషాల స్క్రీన్-టైమ్‌తో, శివ రాజ్‌కుమార్ తన మెస్మరైజింగ్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆయన స్క్రీన్ ప్రజెంస్ కి ఫిదా అయిపోయారు ఇతర భాషల ప్రేక్షకుల. ఈ సినిమా విడుదలైన దగ్గర నుంచి అన్ని భాషల వారి అభిమానాన్ని పొందుతున్నాడు. సోషల్ మీడియాలో కూడా ఈ హీరోని తెగ పొగిడేస్తున్నారు సినీ ప్రేక్షకులు. ముఖ్యంగా చివరి ఐదు నిమిషాలు రజనీకాంత్, మోహన్ లాల్ ని డామినేట్ చేశారు ఈ హీరో.
ఇక ఈ జైలర్ సినిమా చూసిన వారందరూ ఖచ్చితంగా ఈ సినిమా శివరాజ్ కుమార్ కి టర్నింగ్ పాయింట్ అవుతుందని, ఇతర భాషలలోని పెద్ద ప్రాజెక్ట్‌ల దర్శకనిర్మాతలు అతనిని కీలక పాత్రల కోసం సంప్రదించి అతని స్టార్ ఇమేజ్‌ను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు.
“నేను జైలర్ కథ రాస్తున్నప్పుడు, సినిమాలో చాలా మంది సూపర్‌స్టార్‌లను ఎంపిక చేయాలని అనుకున్నాను – ఒక పాత్ర బీహార్ నుండి, మరొకటి కేరళ నుండి మరియు మరొకటి మంగళూరు నుండి. అందుకే మోహన్‌లాల్ సర్, శివ రాజ్‌కుమార్ సర్‌లను నటింపజేయాలని నిర్ణయించుకున్నాను. నేను వారిని వ్యక్తిగతంగా కలిసినప్పుడు పోర్ట్‌ఫోలియోలు చేయాలని, వారి చిత్రాలను తీయాలని కూడా అనుకున్నాను, ”అని జైలర్ సినిమా దర్శకుడు నెల్సన్ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
“కేరళ అంతటా జైలర్ సినిమా ఉర్రూతలూగిస్తుందని మోహన్ లాల్ సార్ నాకు ఫోన్ చేశారు. తన పాత్రకు కన్నడ సినీ ప్రియుల నుంచి మంచి స్పందన వస్తోందని శివ రాజ్‌కుమార్ సార్ కూడా నాకు ఫోన్ చేశారు. ”అని కూడా చెప్పుకొచ్చారు నెల్సన్ .
అయితే కన్నడ సిని ప్రియులు ఇంతగా శివరాజ్ కుమార్ పాత్రను జైలర్ ఎంజాయ్ చేస్తున్నారో అంతకుమించి సౌత్ ఇండియా, నార్త్ ఇండియా ప్రేక్షకులు కూడా రెట్టింపు అభిమానాన్ని ఆయనపై కురిపిస్తున్నారు. మొత్తానికి ఒక సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న హీరోలను చూసాము కానీ ఇలా కేవలం 10 నిమిషాల గెస్ట్అప్పియరెన్స్ తో ఇంతటి అభిమానం తెచ్చుకుని ఘనత శివరాజ్ కుమార్ కే దక్కుతోంది.