Jailer Collections: సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ మూవీ ఆగస్టు 10న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అయ్యింది. రజనీ నుండి గత కొద్ది కాలంగా వస్తున్నా సినిమాలు నిరాశపరచడంతో మొదటి లో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. కానీ తమన్నా పాట హిట్ కావడం, ఆ తర్వాత ట్రైలర్ సూపర్ సక్సెస్ కావడంతో సినిమాలో ఏదో విషయం ఉందని అనిపించింది. దానికి తగ్గట్లే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగానే జరిగాయి.
జైలర్ మూవీ దాదాపు 122 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తమిళనాడు లో 66 కోట్లు ఆంధ్ర, తెలంగాణ 12 కోట్లు, కర్ణాటక 10 కోట్లు, కేరళ 6 కోట్లు, నార్త్ ఇండియా 2 కోట్లు, ఓవర్సీస్ 30 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. అయితే సినిమా హిట్ టాక్ వస్తే ఈ మొత్తం తిరిగి రాబట్టుకోవడం పెద్ద కష్టమేమి కాదని నిర్మాతలకు, బయ్యర్లకు తెలుసు. వాళ్ల నమ్మకాన్ని నిజం చేస్తూ జైలర్ మొదటి రోజు మంచి వసూళ్లు తో దూసుకొని వెళ్ళాడు.
ఒక్క ఓవర్శిస్ లోనే దాదాపు 1.5 మిలియన్ డాలర్స్ వసూళ్లు సాధించిన జైలర్ మూవీ, విజయ్ నటించిన బీస్ట్ మూవీ రికార్డును బద్దలు కొట్టింది. ఇక తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, నార్త్ బెల్ట్ లో కలిపి తొలిరోజే 52 కోట్లు గ్రాస్ వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 45 కోట్ల దాకా నెట్ వసూళ్లు చేసింది. ఇక తమిళనాడులో అయితే పొన్నియన్ సెల్వన్ పేరు మీద ఉన్న తొలిరోజు వసూళ్లు రికార్డును బద్దలు కొట్టాడు జైలర్.
78 % ఆక్యుపెన్సీతో ఇండియాలో మొదటి రోజు 52 కోట్లు వసూళ్లు సాధించటం మామూలు విషయం కాదు. తమిళనాడు 23 కోట్లు, కర్ణాటక 11 కోట్లు, ఆంధ్ర, తెలంగాణ 10 కోట్లు, కేరళ 5 కోట్లు వసూళ్లు వచ్చాయి. సినిమాకి మంచి టాక్ రావడంతో ఈ వీకెండ్ కలెక్షన్స్ కూడా భారీగా ఉండే అవకాశం ఉంది. సినిమా కు వస్తున్న ఆదరణ చూస్తుంటే మొదటి వారంలో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
తమిళనాడు, తెలుగు రెండు స్టేట్స్ లో రజినీకాంత్ కు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి తెలిసిందే, ఇక కర్ణాటక లో కేరళ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. వాటికి తోడు ఈ సినిమాలో కర్ణాటక సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ స్పెషల్ రోల్స్ లో నటించడంతో ఆయా ఏరియా లో సినిమాకు మంచి వసూళ్లు రావడానికి హెల్ప్ అవుతుంది. ఈ సినిమాతో రజిని ఈజ్ బ్యాక్ అనే మాటలు వినిపిస్తున్నాయి. బాక్సాఫీస్ దగ్గర రజిని స్థాయి ఏమిటో ఈ సినిమా మరోసారి నిరూపించే అవకాశం ఉంది.