https://oktelugu.com/

Jailer Box Office Collection : 13వ రోజు నెమ్మదించిన జైలర్.. మొత్తంగా ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే!

జైలర్ వరల్డ్ వైడ్ రూ. 122.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తమినాడులో రూ. 62 కోట్లకు అమ్మారు. తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 కోట్లకు విక్రయించారు.

Written By:
  • NARESH
  • , Updated On : August 23, 2023 / 09:42 AM IST
    Follow us on

    Jailer Box Office Collection : సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ వసూళ్ళు తగ్గుముఖం పట్టాయి. రెండో వారం చివర్లో జైలర్ వరల్డ్ వైడ్ తక్కువ వసూళ్లు రాబడుతుంది. ముఖ్యంగా తెలుగులో జైలర్ వసూళ్లు సాధారణంగా ఉన్నాయి. 13వ రోజు జైలర్ బాక్సాఫీస్ వద్ద స్ట్రగుల్ అయ్యింది. జైలర్ ఇప్పటికే భారీ లాభాలు పంచిన నేపథ్యంలో నిర్మాతలు, బయ్యర్లు ఫుల్ ఖుషిలో ఉన్నారు. చాలా కాలం తర్వాత రజినీకాంత్ తన రేంజ్ హిట్ కొట్టాడు. 2.0 అనంతరం రజినీకాంత్ కి హిట్ లేదు. దీంతో ఆయన మార్కెట్ పడిపోతూ వచ్చింది.

    ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రజినీకాంత్ సినిమాలు చూడటం మానేశారు. ఆయన నటించిన పేట, దర్బార్, పెద్దన్న కనీస ఆదరణ దక్కించుకోలేకపోయాయి. తెలుగులో ఇవి అసలు ఆడలేదు. ఇక రజినీకాంత్ పనైపోయిందనుకుంటున్న తరుణంలో జైలర్ తో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ అయ్యాడు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ యాక్షన్ ఎంటర్టైనర్ జైలర్ తెరకెక్కించారు. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న జైలర్ వసూళ్లు దుమ్ముదులిపింది.

    జైలర్ వరల్డ్ వైడ్ రూ. 122.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తమినాడులో రూ. 62 కోట్లకు అమ్మారు. తెలుగు రాష్ట్రాల్లో రూ. 12 కోట్లకు విక్రయించారు. రూ. 123 కోట్ల టార్గెట్ తో బరిలో దిగిన జైలర్ సత్తా చాటింది. తెలుగులో అయితే వీకెండ్ ముగిసే నాటికే బ్రేక్ ఈవెన్ అయ్యింది. నైజాంతో పాటు ఏపీ బయ్యర్లకు డబుల్ ప్రాఫిట్ తెచ్చిపెట్టింది.

    ఇక జైలర్ 13వ రోజు వసూళ్లు మాత్రం తగ్గాయి. ఏపీ/తెలంగాణాలలో జైలర్ మంగళవారం రూ. 70 లక్షల షేర్ వసూలు చేసిందని సమాచారం. ఇక వరల్డ్ వైడ్ రూ. 3.5 కోట్ల షేర్ రాబట్టిందని అంచనా. ఇక మొత్తంగా 13 రోజులకు గానూ జైలర్ రూ. 257 కోట్ల వరల్డ్ వైడ్ షేర్, రూ. 522 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. జైలర్ మూవీలో తమన్నా, రమ్యకృష్ణ, సునీల్ కీలక రోల్స్ చేశారు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ గెస్ట్స్ రోల్స్ లో అలరించారు.