Chiranjeevi: రీసెంట్ గా స్టార్ సెలబ్రిటీలు తమ వ్యక్తిగత ఫోటోలు,వీడియోలకు, వాయిస్ కి భద్రతా కోరుతూ కోర్టుని ఆశ్రయించడం, కోర్టు అందుకు అంగీకరించడం వంటివి సర్వ సాధారణం అయిపోయింది. ఐశ్వర్య రాయ్ ముందుగా ఇది మొదలు పెట్టింది. ఆ తర్వాత ఆమె భర్త అభిషేక్ బచ్చన్, హృతిక్ రోషన్ లు కూడా తమ వ్యక్తిగత ఫోటోలకు భద్రతా కోరుతూ కోర్టు మెట్లు ఎక్కారు. ఇక మన టాలీవుడ్ లో ముందుగా అక్కినేని నాగార్జున ఈ ప్రయత్నం చేసాడు, సుప్రీమ్ కోర్టు అంగీకరించింది. నాగార్జున తో పాటు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కూడా సుప్రీమ్ కోర్టు లో ఈ విషయం పై పిటీషన్ దాఖలు చేసాడు. నేడు సుప్రీమ్ కోర్టు అందుకు అంగీకారం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మీదట మెగాస్టార్ చిరంజీవి కి సంబంధించిన ఫోటోలను, వీడియోలను, ఆయన వాయిస్ ని వాణిక్య ప్రయోజనాల కోసం ఉపయోగించరాదు.
Also Read: పూరి జగన్నాధ్ – విజయ్ సేతుపతి సినిమాలో పూరి మార్క్ మిస్ అవుతుందా..?
చిరంజీవి అనుమతి ఇస్తే ఉపయోగించుకోవచ్చు కానీ, ఆయన అనుమతి లేకుండా, ఆయనని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించడానికి కుదరదు. అంతే కాదు చిరంజీవి ఫోటోలను ట్రోల్ చేయడానికి మార్ఫింగ్స్ చేయడం సర్వసాధారణం అయిపోయింది. కేవలం చిరంజీవి విషయం లోనే కాదు, ప్రతీ సినీ సెలబ్రిటీ కి ఎదురయ్యే సమస్య ఇది. కానీ ఇక మీదట చిరంజీవి పై అసభ్య పదజాలంతో ట్రోల్ చేసిన, ఆ ఫోటోలను మార్ఫింగ్ చేసిన జైలు శిక్ష అనుభవించక తప్పదు. సోషల్ మీడియా లో మెగా ఫ్యాన్స్ మరియు నందమూరి ఫ్యాన్స్ మధ్య ఫ్యాన్ వార్స్ ఏ రేంజ్ లో జరుగుతూ ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలిసి తెలియని వయస్సుకు సంబంధించిన యువకులు, తస్మాత్ జాగ్రత్త. హద్దులు దాటి ఇక మీదట ప్రవర్తిస్తే మీ బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకున్నట్టే. విమర్శించండి పర్వాలేదు, కానీ బూతులతో, మార్ఫింగ్ ఫొటోలతో కాదు, ఇది గుర్తు పెట్టుకోండి అంటూ మెగా ఫ్యాన్స్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన ఈ ప్రెస్ నోట్ ని మీరు కూడా చూడండి. చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అయిన ఒకరు ఫోటోలను మార్ఫింగ్ చేయడం చాలా అన్యాయమైన పని. చిరంజీవి పెద్ద సెలబ్రిటీ, ఆయన ఫోటోలను మార్ఫింగ్ చేసినా ఆయనకు ఎలాంటి నష్టం ఉండదు. కానీ సామాన్యుల పరిస్థితి ఏంటి?, సోషల్ మీడియా స్వేచ్ఛగా మన వ్యక్తిగత ఫోటోలను అప్లోడ్ చేసుకోవడానికి లేదు. ఎక్కడ ఆకతాయిలు దానిని మార్ఫింగ్ చేస్తారో అని భయం. ప్రైవసీ పెట్టుకొని సోషల్ మీడియా అకౌంట్స్ ని మ్యానేజ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇలా ఎంత కాలం?, ప్రత్యేకంగా సినీ సెలబ్రిటీలు లాగా కోర్టు మెట్లు ఎక్కలేరు సామాన్యులు, కాబట్టి సోషల్ మీడియా కోసం ఒక బలమైన చట్టం తీసుకొని రావాలి అంటూ నెటిజెన్స్ నుండి ఎదురవుతున్న డిమాండ్.
An official note from the legal Team of Megastar Chiranjeevi.#Chiranjeevi garu secures a Hyderabad Court injunction protecting his name, image, voice, likeness & AI recreations from misuse.
Morphs & AI misuse Now punishable by law! @KChirutweets pic.twitter.com/1AQMKGOm8b
— MegaPower (@SandyDhanapala) October 25, 2025