Homeఎంటర్టైన్మెంట్Rajamanaar from Salaar : భయంకరమైన రౌద్రంగా జగపతిబాబు !

Rajamanaar from Salaar : భయంకరమైన రౌద్రంగా జగపతిబాబు !

Jagapathi Babu as Rajamanaarపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా రానున్న సినిమా ‘సలార్’ సినిమా నుండి నిన్న ‘రాజమన్నార్’ రాబోతున్నాడు అంటూ ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు ‘రాజమన్నార్’ పోస్టర్ వచ్చింది. అందరిని షాక్ కి గురి చేస్తూ.. ‘రాజమన్నార్’ జగపతిబాబు భయంకరమైన లుక్ లో రౌద్రంగా కనిపించారు. ముడతలు పడిన చర్మంతో కోపంగా చూస్తూ మొత్తానికి జగపతిబాబు తన లుక్ భారీ సర్ ప్రైజ్ చేశారు.

ఈ లుక్ తో ‘రాజమన్నార్’ (Rajamanaar), సలార్ సినిమాలోనే హైలైట్ అయ్యేలా ఉన్నాడు. అసలు జగపతిబాబు ఇంట వైల్డ్ గా ఓల్డ్ గెటప్ లో మొదటిసారి నటించడం, పైగా గెటప్ లోనే భారీ సెటప్ కనిపించడం మొత్తమ్మీద జగ్గు బాయ్ కెరీర్ లోనే ‘రాజమన్నార్’ ప్రత్యేక పాత్రగా నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు.

చాలా రోజులు తర్వాత ఆశగా చూసిన జగపతిబాబు అభిమానుల ఎదురుచూపులకు ఫలితం దక్కింది. ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి.. కచ్చితంగా ఈ సినిమాతో జగపతిబాబుకు పాన్ ఇండియా ఇమేజ్ రావడం పక్కా. పైగా ఆయన పాత్ర అవతారమే పూర్తి భిన్నంగా ఉంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ జగ్గు బాయ్ పాత్రను అద్భుతంగా డిజైన్ చేశారట.

ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్‌ ఈ పాన్ ఇండియా క్రేజీ యాక్షన్ ఫిల్మ్ ను రెండు భాగాలుగా విడుద‌ల చేయాలనే ఆలోచ‌నలో ఉంది. ప్రభాస్ కి ఉన్న మార్కెట్ దృష్ట్యా సలార్ ను రెండు పార్ట్స్ గా రిలీజ్ చేస్తే.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకి ఐదు వందల కోట్లు దాకా లాభాలు వచ్చే అవకాశం ఉంది.

ఎలాగూ బిజినెస్‌ ప‌రంగా భారీ లాభాల‌ను ఆర్జించ‌డంలో ప్ర‌శాంత్ నీల్ దిట్ఠ. ఇక ‘సలార్‌’లో ప్రభాస్‌ సరసన శ్రుతిహాసన్‌ సందడి చేయనుంది. ఏప్రిల్‌ 14, 2022న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular