Jagapathi Babu and Srikanth: టూ టైర్ హీరోల కెరీర్ చాలా టఫ్. వరుసగా మూడు నాలుగు ప్లాప్స్ పడితే అవకాశాలు తగ్గిపోతాయి. యంగ్ హీరోలకే కాదు రెండు దశాబ్దాలకు పైగా హీరోలుగా కొనసాగినవారి పరిస్థితి కూడా ఇదే. హీరోగా రిటైర్ కాకముందే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జగపతిబాబు ఇందుకు మంచి ఉదాహరణ. ఫ్యామిలీ చిత్రాల హీరోగా జగపతిబాబు 90లలో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు.

ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ లో నటించి సూపర్ హిట్స్ నమోదు చేసిన జగపతిబాబు కెరీర్ మెల్లగా కిందకు పడిపోయింది.ఒక దశలో హీరోగా సినిమాలు చేస్తున్నా ఒక్క హిట్ దక్కలేదు. మరోవైపు ఆర్థిక ఇబ్బందులు. వ్యసనాల కారణంగా జగపతిబాబు నటుడిగా సంపాదించిన ఆస్తి మొత్తం పోగొట్టుకున్నారు. పదుల సంఖ్యలో ప్లాప్స్ ఎదుర్కొన్న జగపతిబాబుతో సినిమా చేసే దర్శక నిర్మాతలే కరువయ్యారు.
అలాంటి దుర్భర సమయంలో జగపతిబాబు కెరీర్ లో మొదటిసారి విలన్ పాత్రకు ఒప్పుకున్నారు. 2014లో విడుదలైన లెజెండ్ మూవీలో బాలయ్యకు విలన్ గా సీరియస్ రోల్ చేశారు. ఆ సినిమాతో పాటు జగపతిబాబు విలనిజం కూడా సూపర్ హిట్. దీంతో వరుసగా విలన్, క్యారెక్టర్ రోల్స్ చేయడం మొదలుపెట్టాడు. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా సౌత్ ఇండియాలో టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా జగపతిబాబు ఎదిగారు. హీరోగా ఉన్నప్పటికంటే ఎక్కువ సంపాదిస్తున్నారు.
Also Read: నిహాకు ఎప్పుడు అదే పని.. క్యాప్షన్ పెట్టిన భర్త చైతన్య
కాగా జగపతిబాబును స్ఫూర్తిగా తీసుకున్న శ్రీకాంత్ అదే దారిని ఎంచుకున్నారు. కానీ జగపతిబాబు వలె ఆయన సక్సెస్ కాలేకపోతున్నారు. దాదాపు ఒకే కాలానికి చెందిన శ్రీకాంత్, జగపతిబాబు ఒకే ఇమేజ్ కలిగి ఉండేవారు. ఇద్దరూ ఫ్యామిలీ చిత్రాల హీరోలుగా సక్సెస్ అయ్యారు. హీరోగా శ్రీకాంత్ కెరీర్ కూడా ముగిసింది. సీరియస్ విలన్ గా ఎదగాలన్న ఆయన ప్రయత్నాలు మాత్రం ఫలించడం లేదు.
నాగ చైతన్య కు విలన్ గా యుద్ధం శరణం మూవీ చేసిన శ్రీకాంత్… తాజాగా అఖండ మూవీలో విలన్ రోల్ చేశారు. అఖండ సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ శ్రీకాంత్ కి ఒరిగిందేమీ లేదన్న మాట వినిపిస్తుంది. దీంతో జగపతిబాబు మాదిరి శ్రీకాంత్ ఎందుకు సక్సెస్ కావడం లేదన్న సందేహం తలెత్తుతుంది.
Also Read: ఆ హీరోతో నటించడానికి అసంతృప్తి వ్యక్తం చేసిన లేడీ సూపర్ స్టార్… నయనతార