Jagapathi Babu
Jagapathi Babu: ప్రభాస్ మంచితనం గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. అందరినీ డార్లింగ్ అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ తన దగ్గరికి ఎవరు వచ్చినా కడుపునిండా భోజనం పెట్టి పంపిస్తూ ఉంటారు ఈ హీరో. అందుకే సినీ ప్రేక్షకులకే కాదు సినిమా ఇండస్ట్రీలో ఉండే వారికి కూడా ఈయన అంటే చాలా ప్రేమ.
మరోపక్క అదే కోవకు చెందుతాడు మరో నటుడు జగపతిబాబు కూడా. ఒకరి జోలికి పోకుండా తన పని తాను చేసుకుంటూ ముక్కుసూటిగా మాట్లాడుతూ అందరిని మెప్పిస్తూ ఉంటాడు జగ్గు భాయ్. ఇక అలాంటి జగ్గు భాయ్ ప్రభాస్ ని ఈ మధ్య తెగ ఆకాశానికి ఎత్తేశారు. జగపతిబాబు ప్రభాస్ గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రభాస్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉన్నాయి.
అసలు విషయానికి వస్తే ఇంతకుముందు జగపతిబాబు ప్రభాస్ కలిసి పని సినిమాల్లో నటించారు. ఇక ఇప్పుడు కూడా వీరిద్దరూ కలిసి ప్రశాంత్ నీల్ సలార్ సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు జగపతిబాబు.
ప్రభాస్ మంచితనం గురించి జగపతిబాబు చెబుతూ.. ‘ప్రభాస్, ఆయన ఫ్యామిలీ నుంచి మనం 20 శాతం నేర్చుకున్నా చాలు.. చాలా మంచి మనిషి.. ఇవ్వడమే తప్పా.. అడగడం తెలీదు.. ఎవరేం అడిగినా ఇస్తాడు.. ఎందుకో నేను చెబుతాను. ఓ సారి నేను డిప్రెషన్‌లో ఉన్నాను.. అప్పుడు ప్రభాస్‌కి ఫోన్ చేశాను.. అప్పుడు ప్రభాస్ జార్జియాలో ఉన్నాడు. నేను ఫోన్ చేసి కొంచెం డిప్రెస్‌గా ఉన్నాను.. నీతో మాట్లాడాలి అని చెప్పాను. వెంటనే డార్లింగ్.. నేనున్నా కదా? నీ ప్రాబ్లం ఏంటో చెప్పు.. సాల్వ్ చేసేద్దాం అని అన్నాడు’ అంటూ చెప్పుకొచ్చారు జగ్గు భాయ్.
‘నాకంటే ప్రభాస్ చాలా చిన్నోడు.. నేనేమో ఓదార్పు కోసం ప్రభాస్ కి ఫోన్ చేశాను అంటే అర్థం చేసుకోండి. అంతేకాదు అతను అందరిలాగా ఊరికే మాటలు అనడు. ఏదైనా ఒక మాట ఇస్తే తప్పకుండా ఆ మాట నిలబెట్టుకుంటాడు. తాను చెప్పినట్టే జార్జియా నుంచి వచ్చాక నాతో మాట్లాడాడు.. సమస్య ఏంటి .. నేను సాల్వ్ చేస్తా అని అడిగాడు.. నాకేం అవసరం లేదు.. చిన్న ఓదార్పు కోరుకున్నాను అంతే’ అంటూ జరిగిన విషయాన్ని చెప్పుకొచ్చారు జగపతిబాబు.
ఇక జగపతిబాబు దగ్గర నుంచి తమ అభిమాన హీరో గురించి ఇలా గొప్పగా మాటలు వినడంతో ప్రభాస్ అభిమానులు తెగ ఖుషి అయిపోతున్నారు.