https://oktelugu.com/

Jagapathi Babu On Salaar: సలార్ మూవీలో నా పాత్ర ఇదే, ప్రభాస్ తో పార్ట్ 2 లోనే… జగపతిబాబు మైండ్ బ్లోయింగ్ అప్డేట్

బ్యాక్ టు బ్యాక్ రిలీజులతో ప్రభాస్ తన ఫ్యాన్స్ కి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పంచనున్నారు. ప్రభాస్ అప్ కమింగ్ చిత్రాల్లో సలార్ మీద భారీ హైప్ ఉంది. కెజిఎఫ్ సిరీస్ తో దేశాన్ని ఊపేసిన ప్రశాంత్ నీల్ ఈ చిత్ర దర్శకుడు కావడం ప్రధాన కారణం. ప్రభాస్ వంటి మాస్ పాన్ ఇండియా హీరోతో ప్రశాంత్ నీల్ తెరకెక్కించే చిత్రం ఊహకు మించి ఉంటుందని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు.

Written By: , Updated On : July 16, 2023 / 01:57 PM IST
Jagapathi Babu On Salaar

Jagapathi Babu On Salaar

Follow us on

Jagapathi Babu On Salaar: రాధే శ్యామ్ ముందు వరకు ప్రభాస్ సినిమా సినిమాకు మధ్య రెండేళ్లకు పైగా గ్యాప్ ఇచ్చారు. ఫ్యాన్స్ డిమాండ్ మేరకు వరుసగా చిత్రాలు చేస్తానని హామీ ఇచ్చిన ఆయన, అది నిలబెట్టుకుంటున్నారు. గత ఏడాది సమ్మర్ లో రాధే శ్యామ్ విడుదల చేసిన ప్రభాస్ జూన్ 16న ఆదిపురుష్ మూవీతో ప్రేక్షకులను పలకరించారు. మరో రెండు నెలల్లో సలార్ తో సందడి చేయనున్నారు. సలార్ మూవీ సెప్టెంబర్ 28న విడుదల కానుంది. మరో మూడు నెలలకు ప్రాజెక్ట్ కే వచ్చేస్తుంది.

బ్యాక్ టు బ్యాక్ రిలీజులతో ప్రభాస్ తన ఫ్యాన్స్ కి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ పంచనున్నారు. ప్రభాస్ అప్ కమింగ్ చిత్రాల్లో సలార్ మీద భారీ హైప్ ఉంది. కెజిఎఫ్ సిరీస్ తో దేశాన్ని ఊపేసిన ప్రశాంత్ నీల్ ఈ చిత్ర దర్శకుడు కావడం ప్రధాన కారణం. ప్రభాస్ వంటి మాస్ పాన్ ఇండియా హీరోతో ప్రశాంత్ నీల్ తెరకెక్కించే చిత్రం ఊహకు మించి ఉంటుందని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు.

ఇటీవల సలార్ టీజర్ విడుదల చేశారు. దానికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. వ్యూస్ లో మాత్రం దుమ్ముదులిపింది. గత రికార్డ్స్ మొత్తం బ్రేక్ చేసింది. తక్కువ సమయంలో వంద మిలియన్ వ్యూస్ దాటేసింది. సలార్ మూవీ మీద జనాల్లో ఉన్న హైప్ కి ఇది నిదర్శనం. ఈ చిత్రంలో జగపతిబాబు కీలక రోల్ చేస్తున్నారు. ఆయన మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఇచ్చారు. సలార్ రెండు భాగాలుగా విడుదల కానుందని ప్రచారం జరుగుతుండగా ఆయన క్లారిటీ ఇచ్చారు.

సాలార్ 2 కూడా ఉంటుందని చెప్పేశాడు. ఇక పార్ట్ 1 లో ప్రభాస్-జగపతిబాబు కాంబినేషన్లో ఒక్క సీన్ కూడా ఉండదట. పార్ట్ 2 లో మాత్రం ఇద్దరి మధ్య ఆసక్తికర సన్నివేశాలు ఉంటాయట. ఈ విషయాన్ని జగపతిబాబు స్వయంగా వెల్లడించారు. ఇక మలయాళ స్టార్ పృథ్వి రాజ్ సలార్ చిత్రంలో ప్రధాన విలన్ రోల్ చేస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. కెజిఎఫ్ మేకర్స్ హోమ్బలే పిక్చర్స్ నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.