Jagapathi Babu Comments On Ramya Krishna: సినిమా ఇండస్ట్రీ కి వెళ్లాలని స్టార్ హీరోగా రాణించాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. కానీ ఇండస్ట్రీలో రాణించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు. ఇండస్ట్రీ ఒక సముద్రం లాంటిది ఇందులో నిలదొక్కుకోవాలి అంటే అన్నింటిని వదిలేసి మొండి ధైర్యంతో ముందుకు సాగాల్సిన అవసరమైతే ఉంది. ఇక్కడ ఏ కొంచెం నిర్లక్ష్యం వహించిన కూడా వెనకబడిపోయే ప్రమాదమైతే ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఎవరికి వారు అప్డేట్ అవుతూ వాళ్ల లోపాలను తెలుసుకొని వాటిని సరిదిద్దుకుంటు ముందుకు వెళ్ళాలి. అలాంటి వాళ్లకి మాత్రమే ఇండస్ట్రీలో గొప్ప అవకాశాలు వస్తాయి. ఇక ఇలాంటి సందర్భంలో కొంతమంది హీరోలు మాత్రం చాలా సంవత్సరాల పాటు సినిమాలను చేస్తూ తమకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకుంటూ ఉంటారు… ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న జగపతిబాబు ఎన్నో గొప్ప సినిమాలను చేశాడు. ఆ తర్వాత ఆయన నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయకపోవడంతో ఆయన మార్కెట్ భారీగా తగ్గిపోయింది. దాంతో అప్పటినుంచి ఆయన విలన్ గా మారి ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు…ఇక రీసెంట్ గా జీ 5 లో వస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్ము రా’ షో కి హోస్టుగా వ్యవహరిస్తున్నాడు. అయితే రీసెంట్ గా ఈ షోలోకి రమ్యకృష్ణ గెస్ట్ గా వచ్చింది. రమ్యకృష్ణ – జగపతిబాబు కాంబినేషన్లో చాలా సినిమాలు వచ్చాయి…
Also Read: పటిష్టంగా ఆస్ట్రేలియా.. సిరీస్ గెలవాలంటే టీమ్ ఇండియా చేయాల్సింది ఇదే!
అందులో ఆయనకిద్దరు, ఖుషి ఖుషి గా లాంటి సినిమాలు మంచి విజయాలను సాధించాయి…ఇక ఈ షోలో జగపతిబాబు రమ్యకృష్ణను ఉద్దేశించి ఒక ప్రశ్న అడిగాడు. చిన్నప్పటి నుంచి నీ వెంట పడడం గానీ, నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ లవ్ ప్రపోజల్స్ చేసిన వారు ఎవరైనా ఉన్నారా? అని అడగగా రమ్యకృష్ణ దానికి సమాధానంగా నీతో కలిపి చాలా మంది ఉన్నారు అంటూ చెప్పేసింది…
దాంతో అటు జగపతిబాబు ఇటు రమ్యకృష్ణ ఇద్దరు నవ్వుకున్నారు… అప్పట్లో ఇద్దరు కలిసి నటిస్తున్నప్పుడు జగపతిబాబు రమ్యకృష్ణ తో నేను నిన్ను లవ్ చేస్తున్నాను అంటూ ఫన్నీ గా చెప్పేవాడట. అందువల్లే రమ్యకృష్ణ ఈ విషయాన్ని చెప్పేసింది.
జగపతిబాబు అప్పట్లో ఫన్నీగా చెప్పిన విషయాన్ని రమ్యకృష్ణ కూడా ఇప్పుడింకా చాలా ఫన్నీగా ఆ ఇన్సిడెంట్ ని గుర్తు చేసుకోవడం విశేషం…ఇక జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా రాణిస్తుంటే, రమ్యకృష్ణ సైతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన రీతిలో సత్తా చాటుతోంది. తను బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో ఎంతటి వైవిధ్యాన్ని కనబరిచిందో మనందరికీ తెలిసిందే…ఇకమీదట కూడా ఆమె మరిన్ని సినిమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్లాలని కోరుకుందాం…
పాత జ్ఞాపకాలు !
Video Courtesy: Zee Cinemalu pic.twitter.com/mEovensBtu
— Telugu360 (@Telugu360) October 29, 2025