Roja Jabardasth : ఈటీవీ లో గత పదేళ్ల నుండి విరామం లేకుండా కొనసాగుతున్న ఎంటర్టైన్మెంట్ షో జబర్దస్త్. ప్రస్తుతం ఒకప్పటి రేంజ్ లో నడవట్లేదు అనే చెప్పొచ్చు..దానికి కారణం ఈ షోలో మొదటి నుండే జడ్జీలు మరియు కమెడియన్లు ఒక్కొక్కరిగా షో వదిలి వెళ్లిపోవడమే..తొలుత నాగబాబు ఈ షో నుండి వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత చమ్మక్ చంద్ర , సుడిగాలి సుధీర్ , అనసూయ ఇలా వరుసగా ఈ షోకి ఆయువుపట్టు లాగ ఉన్న అందరూ వెళ్లిపోవడం తో ఈ షోని చూసే వాళ్ళ సంఖ్య బాగా తగ్గిపోయింది.. ఇక ఎంతమంది వెళ్లిపోయిన షో లో జడ్జీ గా కొనసాగుతూ వచ్చిన రోజా మాత్రం నిన్న మొన్నటి వరకు ఈ షో లో కొనసాగారు.. కానీ ఆ తర్వాత ఆమెకి మంత్రి పదవి రావడంతో ఆమె కూడా జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేసింది..అలా అందరూ వెళ్లిపోవడం తో షోకి కళ తప్పింది.
అయితే ఇప్పుడు రోజా మరోసారి జడ్జీ గా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు స్వయంగా ఆమెనే తెలిపింది.. ఈ వారం ప్రసారం అవ్వబొయ్యే ఎపిసోడ్ లో ఆమె సందడి చెయ్యబోతున్నారు..మొన్నటి వరకు ఈ షో కి న్యాయనిర్ణేతలుగా కృష్ణ భగవాన్ మరియు ఇంద్రజ వ్యవహరించారు..ఇప్పుడు కృష్ణ భగవాన్ కి బదులుగా రోజా వచ్చింది..
ఒక పక్క టూరిజం మినిస్టర్ గా పనిచేస్తున్నా కూడా కొన్ని ప్రత్యేక పరిస్థితుల మధ్య ముఖ్యమంత్రి జగన్ ఆమెకి అనుమతిని ఇచ్చినట్టు తెలుస్తుంది..మరోపక్క మినిస్టర్ గా చేస్తూ ఇలాంటి షోస్ లో పాల్గొనడానికి సిగ్గు లేదా అంటూ ప్రతిపక్షాలు రోజాపై చాలా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.. అయితే జగన్ పర్మిషన్ తోనే రోజా ఈ షోలో పాల్గొంటోందని సమాచారం. మరి ఈ విమర్శలపై ఆమె ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో చూడాలి.