Hari Hara Veera Mallu: జనసేన-వైసీపీల మధ్య ఇటీవల విశాఖలో చోటు చేసుకున్న పరిణామాలు రాజకీయంగా వేడిని రగిల్చాయి. పవన్ పై వైసీపీ నాయకులు విమర్శలు చేయగా.. అందుకు జనసేన అధినేత ఎదురుదాడికి దిగారు. అయితే ఈసారి ఆగ్రహంతో ఊగిపోతూ పరుష జాలంతో విమర్శించారు. రాజకీయంగా రెండు పార్టీల మధ్య ఇలాంటి విమర్శలు ఏపీలో కొత్తేమీ కాదు. కానీ ఈ ప్రభావం పవన్ సినిమాలపై పడుతుందా..? అనే ఆందోళన మొదలైంది. పవన్ చేతిలో ప్రస్తుతానికి కొన్ని సినిమాలు ఉన్నాయి. వీటిలో ‘హరిహర వీరమల్లు’ చివరిదశలోకి వచ్చింది. అన్నీ కుదిరితే వచ్చే వేసవిలో దీనిని రిలీజ్ చేయాలని చూస్తున్నారు. దీంతో సీఎం జగన్ జనసేన అధినేతపై ఉన్న కోపం ‘వీరమల్లు’పై చూపిస్తారా..? అని అనుకుంటున్నారు.

కొందరు నిర్మాతలు తమ సినిమాలను ఏపీలో రిలీజ్ చేయడానికి జంకుతున్నారు. ఇక్కడి టిక్కెట్ల రేట్లు తక్కువగా ఉండంతో పెట్టుబడి కూడా వస్తుందో.. లేదో.. ననే ఆందోళనలో ఉన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని సినీ పెద్దలు సీఎం జగన్ ను కలిసి విన్నవించగా.. కొన్ని భారీ బడ్జెట్ సినిమాలకు టిక్కెట్ల రేట్లను పెంచుకునేందుకు అవకాశం ఇచ్చారు. కానీ మిగతా సినిమాలకు ఆ చాన్స్ ఇవ్వలేదు. దీంతో ‘భీమ్లానాయక్’ లాంటి సినిమాలు సాధారణ రేట్లతోనే నడిచాయి. ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాలు రేట్లను పెంచుకొని లాభాలను తెచ్చుకున్నాయి.
పవన్ పై ఉన్న కోపంతోనే ‘భీమ్లానాయక్’ మూవీకి రేట్లను పెంచుకునే అవకాశం ఇవ్వలేదని ఆరోపణలు వచ్చాయి. అయితే మిగతా ఏరియాలన్నీ కలుపుకుంటే ఈ సినిమాకు లాభాలు వచ్చినా అనుకున్న ఆదాయం రాలేకపోయింది. అప్పటి నుంచి పవన్ సినిమాలను రిలీజ్ చేయడానికి నిర్మాతల్లో ఆందోళన మొదలైంది. ఈ ఆందోళన ఇప్పుడు ఏఎం రత్నంలో నూ స్ట్రాట్ అయింది. ‘హరిహరవీరమల్లు’ సినిమాకు ఆయనే నిర్మాత. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల దీని షెడ్యూల్ ఫైనల్ చేసి సీరియస్ గా షూటింగ్ నిర్వహిస్తున్నారు.

అన్నీ కుదిరితే వచ్చే సంవత్సరం వేసవిలో రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల విశాఖలో జరిగిన పరిణామాలు ‘హరిహరవీరమల్లు’పై ప్రభావం చూపుతాయా..? అని చర్చించుకుంటున్నారు. ‘భీమ్లానాయక్’ సమయంలో రేట్లను పెంచకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంది. ప్రతీ థియేటర్ వద్ద అధికారులను పెట్టి అధిక రేట్లను అడ్డుకున్నారు. ఇప్పుడు ‘హరిహరవీరమల్లు’ విషయంలో అలాగే చేస్తే భారీ నష్టమే ఉంటుందని అంటున్నారు. హిస్టారికల్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీపై సినిమా నిర్మాత భారీ హోప్స్ పెట్టుకున్నట్లు సమాచారం. మరి సినిమా రిలీజ్ సమయానికి ఏపీలో ఎటువంటి పరిస్థితులు నెలకొంటాయో చూడాలి.