Acharya Pre Release Event: ఏపీ రాజకీయాలకు టాలీవుడ్ కు అవినాభావ సంబంధం ఉంది. ఎందుకంటే ఏపీ రాజకీయాలను ప్రభావితం చేయగల శక్తి టాలీవుడ్ సినిమాలకు ఉంది. పైగా ఏపీ రాజకీయాల్లో ఉన్నది కూడా సినిమా స్టార్లు. చిరంజీవి నుంచి మొదలుకొని ఇప్పుడు పవన్ కల్యాణ్ వరకు మెగా బ్రదర్స్ ఇద్దరూ రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. ప్రస్తుతం చిరంజీవి పాలిటిక్స్ కు దూరంగా ఉండి కేవలం సినిమాల్లో మాత్రమే నటిస్తున్నారు. తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం అటు సినిమాలు చేస్తూ ఇటు రాజకీయంగా ఫుల్ బిజీగా ఉంటున్నారు.

మొదటి నుంచి సీఎం జగన్ కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అస్సలు పడదు. వీరిద్దరూ ఒకరినొకరు టార్గెట్ చేసుకుంటూనే ఉంటారు. సోషల్ మీడియా వేదికగా జగన్, పవన్ అభిమానుల మధ్య నిత్యం వార్ జరుగుతూనే ఉంటుంది. అయితే మెగా అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ కు చిరు సపోర్టు ఉండాలని కోరుకుంటున్నారు. రాబోయే కాలంలో సీఎం అయ్యే అవకాశాలు పవన్ కు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఏపీ రాజకీయాలు మొత్తం పవన్ కళ్యాణ్ కేంద్రంగా తిరుగుతున్నాయి. ఇంతటి ప్రభావం చూపిస్తున్న పవన్ విషయంలో చిరు చేసిన ఓ పని ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతోంది.
కొరటాల శివ డైరెక్షన్ లో రామ్చరణ్తో కలిసి చిరంజీవి నటించిన ఆచార్య మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సీఎం జగన్ హాజరు అవుతున్నారనే విషయం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. రాజకీయంగా పవన్ ను టార్గెట్ చేస్తున్న జగన్ ను చిరంజీవి కలుపుకుని వెళ్లడం ఏంటి అని మెగా ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. అయితే ఇందుకు బలమైన కారణం ఉందని తెలుస్తోంది. మొన్న టాలీవుడ్ సినిమా టికెట్ల రేట్లు విషయంలో జగన్ ప్రభుత్వం ఎంత వేధించినా చూశాం. అప్పుడు చిరంజీవి చొరవ తీసుకొని ఆ సమస్య పరిష్కారానికి మార్గం చూపించారు. ఇప్పుడు కూడా టాలీవుడ్‌కు ఏపీ ప్రభుత్వానికి మధ్య ఉన్న గ్యాప్ ను తగ్గించడానికి ఆయన ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
ఇందులో రాజకీయపరమైన విషయం ఏమీ లేదని.. జగన్ ను కేవలం తనకున్న సన్నిహిత్యంతోనే పిలిచినట్లు సమాచారం. ఇక్కడ మరో విషయం ఏంటంటే జగన్‌ను పిలిచినంత మాత్రాన పవన్ ను చిరంజీవి దూరం పెట్టినట్లు కాదంటున్నారు కొందరు మెగా ఫ్యాన్స్. చిరంజీవి బహిరంగంగా సపోర్ట్ చేయకపోయినా తన అండదండలు తన ఫ్యాన్స్ మద్దతు ఎప్పటికీ పవన్ కు ఉంటుందని ఇన్‌డైరెక్ట్ గా చాలా సార్లు హింట్ ఇచ్చారు.

సినిమాల్లో ఎలాగైతే నిలదొక్కుకొని అగ్రస్థానాన కూర్చున్నాడో.. రాజకీయాల్లో కూడా అలాగే ఎదుగుతాడని పవన్ ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జగన్‌కు పొలిటికల్ గా ఎప్పుడూ చిరంజీవి సపోర్ట్ చేయలేదు. కేవలం తనకున్న సన్నిహిత్యం కారణంగానే పలుమార్లు కలిసినట్టు చిరంజీవి స్వయంగా ప్రకటించారు. ఇప్పుడు కూడా అదే సన్నిహిత్యం కారణంగా ఆహ్వానించినట్లు సమాచారం. అయితే ఈ వేడుకకు పవన్ ను దూరంగా ఉంచడంపై కూడా చాలా అనుమానాలు వస్తున్నాయి. కానీ జగన్ ఈ వేడుకకు వస్తున్న కారణంగా పవన్ ను ఆహ్వానించలేదని వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఇందులో పొలిటికల్ డ్రామా ఏమీ లేదు. కేవలం సినీ ఇండస్ట్రీ బాబు కోసమే చిరంజీవి ఈ పని చేస్తున్నట్లు అర్థమవుతోంది.
[…] Prashanth Neel: ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద KGF చాప్టర్ 2 సృష్టిస్తున్న ప్రబంజనం మనం రోజు చూస్తూనే ఉన్నాం..బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమాకి వస్తున్నా నంబర్లు చూసి ట్రేడ్ పండితులు సైతం నోరెళ్లబెడుతూన్నారు..కేవలం మూడు రోజుల్లోనే 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని వసూలు చేసి ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా వెయ్యి కోట్ల రూపాయిల మార్కుని ఫుల్ రన్ లో అందుకుంటుందా లేదా అనేది ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో సాగుతున్న చర్చ..ఇదే కనుక జరిగితే బాహుబలి పార్ట్ 2 మరియు #RRR తర్వాత వెయ్యి కోట్ల రూపాయిల మార్కుని అందుకున్న ఏకైక సౌత్ ఇండియన్ సినిమాగా KGF చాప్టర్ 2 సరికొత్త చరిత్ర సృష్టించింది అని చెప్పొచ్చు..ఇక బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి కాసేపు చర్చ పక్కన పెడితే, త్వరలో KGF చాప్టర్ 3 కూడా రాబోతోందా అనేది ప్రస్తుతుం ఇండస్ట్రీ లో టాక్ ఆఫ్ ది మొమెంట్ గా మారింది..చివర్లో ఎండ్ టైటిల్స్ పడేటప్పుడు సినిమా అయిపోయింది కదా అని అందరూ లేచి వెళ్తున్న సమయం పార్టీ 3 కూడా ఉంది అంటూ ఒక్క చిన్న ట్విస్ట్ ని ఇచ్చి అందరిని షాక్ కి గురి అయ్యేలా చేసాడు ప్రశాంత్ నీల్. […]