Jacqueline Fernandez- Sukesh Chandrashekhar: పుర్రెకోబుద్ధి.. జిహ్వ కో రుచి. అని ఓ సామెత. మన బుద్ధి మంచిగా ఉన్నంతవరకు వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదు. అలాగే మన జిహ్వ కూడా మంచి రుచిని కోరుకుంటే పొట్టకు వచ్చిన ఇబ్బంది కూడా ఏమీ ఉండదు. కానీ ఈ రెండింటిలో ఏది దారి తప్పినా జీవితం కూడా దారి తప్పుతుంది. ఇప్పుడు ఇలాంటి స్థితినే శ్రీలంక నుంచి ఇండియాకు దిగుమతి అయిన నటీమణి జాక్వలైన్ ఎదుర్కొంటోంది. ఈమధ్య ₹200 కోట్ల మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరైంది. అసలు ఈ వ్యవహారం అంతటికి కారణం ఆమెకు ఉన్న డబ్బు పిచ్చి. సుఖేష్ చంద్రశేఖర్ అనే ఆర్థిక నేరగాడితో చెట్టా పట్టాలేసుకొని తిరిగిన ఈమె.. అతని వద్ద నుంచి బాగానే లాగింది. ఖరీదైన వస్తువులు, బంగారం, డబ్బు బాగానే కూడపెట్టింది. జాక్వ లైన్, సుఖేశ్ మధ్య జరిగిన వ్యవహారాన్ని తవ్వుతుంటే బోలెడు నిజాలు బయటికి వస్తున్నాయి.

అప్పట్లో సుఖేష్ పలువురుని మోసం చేసి భారీగా వెనకేశాడు. హై ఫై లైఫ్ అనుభవించేవాడు. ఇదే సమయంలో అతడికి ఒక పార్టీలో జాక్వలైన్ పరిచయమైంది. మంచి ఎత్తు, రంగు, బిగుతైన శరీర సౌష్టవం అతని బాగా ఆకర్షించింది. ఎన్ని అందాలను ఆస్వాదించినా.. ఆమె అందం అతడికి కొత్తగా కనిపించింది. ఎలాగైనా ఆమెను పొందాలని అనుకున్నాడు. ఆమెకు ఉన్న వీక్నెస్ పాయింట్లను పట్టాడు. ఇంకేముంది ఖరీదైన బ్యాగులు, బంగారం, డబ్బు ఆమె కోసం ఖర్చు పెట్టాడు. ఆమె కూడా అటువంటి బాపతే కావడంతో అతడికి దగ్గర అయింది. ఇద్దరు కలిసి చెట్టా పట్టాలు వేసుకుని తిరిగారు. అప్పటిదాకా బాలీవుడ్లో అడపాదడప సినిమాలు చేస్తూ నెట్టుకొచ్చిన జాక్వా లైన్.. సుఖేష్ పుణ్యమా అని సినిమాలు చేయడమే మానేసింది. ఒక రకంగా చెప్పాలంటే సుఖేష్ మాయలో పడిపోయింది. అతడినే పెళ్లి చేసుకోవాలని అనుకుందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

వాస్తవానికి తనకు జాక్వ లైన్ పరిచయం లేకపోయినప్పటికీ… ఆమె సన్నిహితురాలు పింకీ ఇరానీ ద్వారా సుఖేష్ దగ్గరయ్యాడు. ఇందుకోసం పింకీ ఇరానికి భారీగానే ముట్ట చెప్పాడు. ఆ మధ్య సుఖేష్ పై వార్త కథనాలు రావడంతో జాక్వలైన్ నివ్వెర పోయింది. ఇదే విషయాన్ని పింకీ ఇరానీని ప్రశ్నిస్తే ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పింది. అయితే సుఖేష్ ద్వారా జాక్వ లైన్ పది కోట్ల విలువైన బహుమతులు అందుకుందని సమాచారం. సుఖేష్ ఆర్థిక నేరగాడని ముందే తెలుసని, అందుకే అతడి సాన్నిహిత్యం కోసం తపించి పోయిందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. కానీ ఎప్పుడైతే సుఖేష్ బాగోతం బయటపడిందో.. అప్పుడే ఈడి అధికారులు రంగంలోకి దిగారు. తీగనంత లాగితే జాక్వ లైన్ తో అతడికి ఉన్న సంబంధం బయటపడింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న అధికారులు పలుమార్లు ప్రశ్నించారు. సుమారు 8 కోట్ల వరకు ఆస్తులను సీజ్ చేశారు. కాగా జాక్వలైన్ ఇటీవల విక్రాంత్ రోణా అనే సినిమాలో నటించింది. “రారా రక్కమ్మ” అనే పాటలో సుదీప్ తో ఆడి పాడింది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ ను షేక్ చేస్తోంది.