https://oktelugu.com/

Anchor Rashmi Gautam : మొగుడు కోసం ప్రియుడిని వదిలేసిన రష్మీ పతివ్రతా… జబర్దస్త్ కమెడియన్ షాకింగ్ కామెంట్స్

మనల్ని చాలా మంది ప్రేమిస్తారు .. మనం మాత్రం ఒక్కరినే ప్రేమిస్తాం అని వర్ష అంటుంది. ఆ ఒక్కరు ఎవరో చెప్పొచ్చు కదా సెట్ మొత్తం వెయిటింగ్ అని ఇమ్ము అంటాడు. మీకు కావాల్సిన వాడు ఎలా ఉండాలి అంటూ ఇమ్ము అడగ్గా .. ఆరు అడుగుల ఎత్తు .. సిక్స్ ప్యాక్ బాడీ ఉండాలి అని వర్ష చెప్పింది. దీంతో మాకు తెలిసిన వాడికి ఇవన్నీ లేవు గా అని ఇమ్ము అంటాడు. దీంతో వర్ష వెంటపడి కొడుతుంది. ఇక బాబుతో వర్ష పెళ్లి జరుగుతుంది. అతనికి యాక్సిడెంట్ అయి వీల్ చైర్ లో ఉంటాడు.

Written By:
  • NARESH
  • , Updated On : March 13, 2024 / 12:59 PM IST
    Follow us on

    Anchor Rashmi Gautam : ఒకప్పుడు జబర్దస్త్ లో సుధీర్ – రష్మీ లవ్ ట్రాక్స్ నెక్స్ట్ లెవల్ అని చెప్పవచ్చు. ఈ ఫెయిర్ బుల్లితెర పై సంచలనాలు చేసింది. స్కిట్ లో కామెడీ కోసం రష్మీ – సుధీర్ చేసే రొమాన్స్ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యింది. వీరిద్దరితో డాన్స్, స్కిట్స్ చేయిస్తూ టిఆర్పీ పెంచుకునేవారు. ప్రస్తుతం సుడిగాలి సుధీర్ సినిమాలు చేస్తూ షోస్ మానేశాడు. మొత్తంగా మల్లెమాల సంస్థకు సుడిగాలి సుధీర్ గుడ్ బై చెప్పేశాడు. సుధీర్-రష్మీ జంటను బుల్లితెర ఆడియన్స్ మిస్ అవుతున్నారు.

    ఆ వెలితి నింపడానికి వర్ష – ఇమ్మాన్యుయేల్ లను లైన్లోకి తెచ్చారు. ఈ జోడి తో షో రక్తికట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో లేటెస్ట్ గా వర్ష – ఇమ్మాన్యుయేల్ ఓ స్కిట్ చేశారు. హీరో శ్రీకాంత్ నటించిన ప్రేయసి రావే సినిమా స్పూఫ్ చేశారు. ఇందులో శ్రీకాంత్, రాశి మధ్య జరిగే సన్నివేశాలు ఫన్నీ గా చూపించారు. ముందుగా ఇమ్మాన్యుయేల్ – వర్ష మధ్య లవ్ ట్రాక్ నడిచింది. ప్రేమ పై మీ ఒపీనియన్ ఏంటని వర్ష ని ఇమ్ము అడుగుతాడు.

    మనల్ని చాలా మంది ప్రేమిస్తారు .. మనం మాత్రం ఒక్కరినే ప్రేమిస్తాం అని వర్ష అంటుంది. ఆ ఒక్కరు ఎవరో చెప్పొచ్చు కదా సెట్ మొత్తం వెయిటింగ్ అని ఇమ్ము అంటాడు. మీకు కావాల్సిన వాడు ఎలా ఉండాలి అంటూ ఇమ్ము అడగ్గా .. ఆరు అడుగుల ఎత్తు .. సిక్స్ ప్యాక్ బాడీ ఉండాలి అని వర్ష చెప్పింది. దీంతో మాకు తెలిసిన వాడికి ఇవన్నీ లేవు గా అని ఇమ్ము అంటాడు. దీంతో వర్ష వెంటపడి కొడుతుంది. ఇక బాబుతో వర్ష పెళ్లి జరుగుతుంది. అతనికి యాక్సిడెంట్ అయి వీల్ చైర్ లో ఉంటాడు.

    ఇదంతా చూసిన ఇమ్ము బాధతో కుమిలిపోతాడు. వర్షను ఆ స్థితిలో చూడలేక మనిద్దరం పెళ్లి చేసుకుందాం అని అంటాడు. అతన్ని వదిలేసి తన వెంట వచ్చేయమని అడుగుతాడు. వర్ష మండి పడుతుంది. ఇమ్ము రెచ్చిపోతాడు .. ఇక్కడికి వచ్చి చూడవే .. నీ పేరే వినిపిస్తుంది. ప్రవహించే ప్రతి నీటి బొట్టులో నీ రూపమే కనిపిస్తుంది .. మొగుడి కోసం ప్రియుడిని వదిలేసిన ప్రేయసి పతివ్రత అయితే .. రష్మీ కూడా ప్రతివ్రతనే అంటూ డైలాగులు కొట్టాడు. దీంతో రష్మీ కూడా షాక్ అయ్యింది. రష్మీ పై ఇమ్ము చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అంటే సుధీర్ ని వదిలేసి రష్మీ వేరే ఒకరిని పెళ్లి చేసుకోనుందా .. మొగుడి కోసం సుధీర్ వదిలేస్తుందా అనే చర్చ మొదలైంది. కానీ ఇదంతా ఫన్ కోసం చేసిందే. ప్రోమో మాత్రం ఆకట్టుకుంటుంది.