Jabardasth Show : జబర్దస్త్ షోకి ఆదరణ తగ్గుతున్న నేపథ్యంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా జడ్జి స్థానంలోకి ఆ సెలబ్రిటీ రీ ఎంట్రీ ఇచ్చాడు. జబర్దస్త్ లో చోటు చేసుకుంటున్న వరుస మార్పులు ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి.
జబర్దస్త్(JABARDASTH) ఓ లెజెండరీ కామెడీ షో అనడంలో సందేహం లేదు. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ ఏళ్ల తరబడి బుల్లితెరను ఏలాయి. గురు, శుక్రవారాలు వచ్చాయంటే హాస్య ప్రియులు టీవీలకు అతుక్కుపోయేవారు. అలాగే లక్షల మంది యూట్యూబ్ లో వీక్షించేవారు. అయితే స్టార్స్ నిష్క్రమణతో జబర్దస్త్ షో ఫేమ్ తగ్గుతూ వచ్చింది. నాగబాబు, అనసూయ(ANASUYA), రోజా ఒకరి తర్వాత
మరొకరు షోని వీడారు. ఈ షోలో స్టార్ కమెడియన్స్ గా ఉన్న సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను సైతం జబర్దస్త్ కి గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం షోలో పలువురు కొత్త కమెడియన్స్ టీమ్ లీడర్స్ గా ఉన్నారు.
అనసూయ స్థానంలోకి యాంకర్స్ గా వచ్చిన సౌమ్యరావు, సిరి హన్మంత్ లను తొలగించారు. ఎక్స్ట్రా జబర్దస్త్ తీసేసి, రెండు ఎపిసోడ్స్ ని జబర్దస్త్ పేరుతో ప్రసారం చేస్తున్నారు. రెండు ఎపిసోడ్స్ కి రష్మీ గౌతమ్ యాంకర్ గా వ్యవహరిస్తోంది. జబర్దస్త్ న్యూ చాప్టర్ బిగిన్స్ అంటూ… ఇటీవల కొన్ని మార్పులు చేశారు. బిగ్ బాస్ ఫేమ్ మానస్ ని మరో యాంకర్ గా తీసుకున్నారు. గతంలో జడ్జిగా వ్యవహరించిన కృష్ణ భగవాన్ రీఎంట్రీ ఇచ్చారు. కుష్బూ, కృష్ణభగవాన్ జడ్జెస్ సీట్స్ లో కనిపించారు. ఇక శివాజీని పక్కన పెట్టారని తెలుస్తుంది.
Also Read: తమ్ముడు ఫుల్ మూవీ రివ్యూ…హిట్టా? ఫట్టా..?
జబర్దస్త్ న్యూ చాప్టర్ బిగిన్స్ లో కృష్ణభగవాన్ ని జడ్జిగా తిరిగి పరిచయం చేసిన టీం, మరలా సింగర్ మను ని తెరపైకి తెచ్చింది. మను చాలా కాలం జబర్దస్త్ జడ్జిగా ఉన్నారు. నాగబాబు వెళ్ళిపోయాక ఆ సీట్లోకి మను(SINGER MANO) వచ్చారు. రోజాతో కలిసి మను చాలా ఎపిసోడ్స్ చేశారు. తనదైన కామెడీ పంచ్ లతో అలరించే ప్రయత్నం చేశాడు. కారణం తెలియదు కానీ మను సైతం జబర్దస్త్ నుండి తప్పుకున్నాడు. ఆయన స్థానంలోకి కృష్ణభగవాన్ వచ్చారు. తాజా ఎపిసోడ్స్ లో కృష్ణభగవాన్ ను జడ్జిగా పరిచయం చేసిన టీమ్ మను ను ఎందుకు తీసుకొచ్చారు అనే సందేహాలు మొదలయ్యాయి.
మను, కృష్ణభగవాన్ లలో ఎవరు పర్మినెంట్ అనే సందేహం మొదలైంది. కుష్బూ తో పాటు జబర్దస్త్ జబర్దస్త్ సీట్ షేర్ చేసుకునే సెలెబ్ ఎవరనే ఆత్రుత మొదలైంది. ఈ సందేహాలకు సమాధానం దొరకాలంటే కొన్ని ఎపిసోడ్స్ గడవాల్సిందే. ఎందరు వచ్చిన రోజా, నాగబాబులను మరిపించలేకపోయారు అనేది నిజం. టీమ్స్ తో మమేకమై వారు వేసే పంచులు సైతం ఎంటర్టైన్ చేసేవి.