Rithu Chowdary: రీతూ చౌదరి బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. జబర్దస్త్ లేడీ కమెడియన్ గా ఆమె పిచ్చ పాప్యులర్. రీతూ చౌదరి మోడలింగ్ చేసింది. అనంతరం సీరియల్ నటిగా మారింది. కొన్ని సీరియల్స్ లో కీలక రోల్స్ చేసింది. అమ్మడుకి బ్రేక్ రాలేదు. ఎదుగూ బొదుగూ లేని చోట ఉండలేక జబర్దస్త్ కమెడియన్ అవతారం ఎత్తింది. సాధారణంగా జబర్దస్త్ లో అమ్మాయిల గెటప్స్ అబ్బాయిలే వేస్తారు. అతికొద్ది మంది మాత్రమే లేడీ కమెడియన్స్ ఉన్నారు. వారిలో రీతూ చౌదరి ఒకరు.
జబర్దస్త్ క్రేజీ షో కావడంతో రీతూ పేరు వెలుగులోకి వచ్చింది. ఇక సోషల్ మీడియా వేదికగా రీతూ చౌదరి చేసే సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. బోల్డ్ ఫోటో షూట్స్ కి అమ్మడు కేర్ ఆఫ్ అడ్రస్. తాజాగా నడుము అందాలు, నాభి సొగసులు హైలెట్ అయ్యేలా ఫోటో షూట్ చేసింది. రీతూ బోల్డ్ లుక్ వైరల్ అయ్యింది. దీంతో నెటిజెన్స్ అమ్మడు అందాల మీద కామెంట్స్ చేస్తున్నారు. అది నడుమా నయాగరా జలపాతమా అంటూ కవుల వలె వర్ణిస్తున్నారు.
మరోవైపు పెళ్లి వార్తలతో రీతూ వార్తల్లో ఉంటుంది. కొన్నాళ్లుగా శ్రీకాంత్ అనే వ్యక్తితో ఆమె సన్నిహితంగా ఉంటుంది. శ్రీకాంత్ తో డేటింగ్ చేస్తున్న రీతూ వివాహం చేసుకోబోతున్నారని కథనాలు వెలువడ్డాయి. అయితే కొన్నాళ్ళు ఆయనకు దూరంగా ఉంది. సోషల్ మీడియా చాట్ లో ప్రేమ, పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పింది. శ్రీకాంత్ కి దూరమయ్యారా అంటే స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.
దీంతో శ్రీకాంత్-రీతూలకు బ్రేకప్ అయ్యిందని పుకార్లు లేచాయి. అనూహ్యంగా తిరిగి శ్రీకాంత్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పెట్టింది. దాంతో ఆమె ఫ్యాన్స్ కన్ఫ్యూస్ అవుతున్నారు. కాగా ఇటీవల రీతూ చౌదరి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆమె తండ్రి అకాల మరణం చెందాడు. ఈ ఘటనతో ఆమె దిగ్బ్రాంతికి గురయ్యారు. అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు.
View this post on Instagram