Jabardasth Punch Prasad: జబర్దస్త్ కమెడియన్స్ లో పంచ్ ప్రసాద్ ఒకరు. ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడంటూ మరో కమెడియన్ ఇమ్మానియేల్ బాంబు పేల్చాడు. ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పంచ్ ప్రసాద్ పెళ్లి ఫోటో షేర్ చేశాడు. అలాగే ఇది అధికారిక సమాచారం అన్నట్లు హింట్ ఇచ్చాడు. పంచ్ ప్రసాద్ గురించి ఇమ్మానియేల్ పోస్ట్ సంచలనంగా మారింది. దీంతో ఈ న్యూస్ ఒక్కసారిగా వైరల్ అయ్యింది. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ప్రసాద్ కి మొదటి భార్య తన కిడ్నీ ఇస్తా అన్నారు. అలాంటి మహిళను వదిలేసి పంచ్ ప్రసాద్ రెండో పెళ్లి చేసుకోవడం ఏమిటంటూ జనాలు ఆశ్చర్యం, ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే ప్రసాద్ నిజంగా రెండో పెళ్లి చేసుకోలేదు. ఇదంతా ఇమ్మానియేల్ చేసిన మ్యాజిక్ అండ్ కన్ఫ్యూషన్ మాత్రమే. ఒక యూట్యూబ్ వీడియోకి వ్యూస్ తేవడం కోసం ఇమ్మానియేల్ ఇలా చేశాడు. ప్రసాద్ పెళ్లి ఫొటోలో అమ్మాయి ముఖం బ్లర్ చేయడంతో అనేక మంది నిజమే అం నమ్మేశారు. పంచ్ ప్రసాద్ రెండో వివాహం చేసుకోలేదనేది వాస్తవం.
ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పంచ్ ప్రసాద్, అతని భార్యకు వివాహం చేశారు. ఆ సందర్భంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఇంట్లో పంచ్ ప్రసాద్ కి భార్యకు మధ్య జరిగిన సంభాషణల వీడియోలు కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికపై ప్రదర్శించారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వీడియోకు ప్రసాద్ కి రెండో వివాహం అని థంబ్ నైల్ పెట్టి ఫోటో విడుదల చేశారు. నిజానికి పంచ్ ప్రసాద్ ఎవరినీ మరో పెళ్లి చేసుకోలేదు.

కొన్నాళ్లుగా పంచ్ ప్రసాద్ కిడ్నీ సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. చికిత్సకు అవసరమైన డబ్బులు జబర్దస్త్ కమెడియన్స్, జడ్జెస్ రోజా, నాగబాబు సమకూర్చారు. అనారోగ్యం కారణంగా పంచ్ ప్రసాద్ చాలా కాలం బుల్లితెరకు దూరమయ్యాడు. ఆరోగ్యం కొంత కుదుటపడటంతో పంచ్ ప్రసాద్ రీ ఎంట్రీ ఇచ్చాడు. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, జాతి రత్నాలు వంటి షోస్ లో ఆయన కనిపిస్తున్నారు. అతడి సమస్య తెలిసిన మిత్రులు అవకాశాలు ఇచ్చి ప్రోత్సాహం అందిస్తున్నారు. రెగ్యులర్ గా పంచ్ ప్రసాద్ డయాలసిస్ చేయించుకున్నట్లు సమాచారం..