Jabardasth Anchor Soumya Rao: కన్నడ భామ సౌమ్యరావు అనూహ్యంగా జబర్దస్త్ యాంకర్ ఛాన్స్ కొట్టేసింది. సీరియల్ నటి అయిన సౌమ్యరావుకు ఈ ఆఫర్ రావడం అనూహ్య పరిణామం. జబర్దస్త్ క్రేజీ షో. ఈ వేదిక సాక్షిగా పదుల మంది స్టార్స్ గా ఎదిగారు. వారిలో యాంకర్స్ అయిన అనసూయ, రష్మీ గౌతమ్ ముందు వరుసలో ఉన్నారు. రష్మీ, అనసూయ అనుభవిస్తున్న స్టార్డం మొత్తం జబర్దస్త్ పుణ్యమే. అందుకే అనసూయ జబర్దస్త్ మానేశారని తెలియగానే చాలామంది యాంకర్స్ ఆ పొజీషన్ ఆశించారు.
అనసూయ జబర్దస్త్ వదిలి వెళ్ళాక కొన్ని వారాలు రష్మీనే యాంకర్ గా వ్యవహరించింది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ యాంకర్ గా చేసి డబుల్ పేమెంట్ తీసుకుంది. తర్వాత సౌమ్యరావును దింపారు. ఈమెకు తెలుగు అంతగా రాదు. అయినా మేకర్స్ ఆమెవైపే మొగ్గు చూపారు. ఇక సౌమ్యరావు ఆడియన్స్ ని అలరించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తుంది. తన మార్క్ క్రియేట్ చేయాలని ఆశపడుతోంది. అయితే అనసూయను మరిపించేంత గ్లామర్ ఆమెకు లేదు.
సౌమ్యరావుకు రెమ్యూనరేషన్ కూడా తక్కువే అని సమాచారం. ఎపిసోడ్ కి లక్ష నుండి లక్షన్నర ఇస్తున్నారట. జబర్దస్త్ యాంకర్ గా చేయడం అదృష్టం. అదే సమయంలో బాధ్యత కూడా. రష్మీ, అనసూయ సక్సెస్ఫుల్ యాంకర్స్ గా ఉన్న నేపథ్యంలో సౌమ్యరావు పోలికలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సౌమ్యరావు కూడా గ్లామర్ ఒలకబోసే ప్రయత్నం చేస్తుంది. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
తాజాగా సౌమ్యరావు పింక్ కలర్ ట్రెండీ వేర్లో సూపర్ హాట్ ఫోజుల్లో దర్శనమిచ్చారు. స్లీవ్ లెస్ ఫ్రాక్ లో ఎద అందాలు చూపించింది. సౌమ్యరావు గ్లామర్ షో నెటిజెన్స్ ని ఆకర్షిస్తుంది. పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సౌమ్యరావు లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. ఇక జబర్దస్త్ కి ఒకప్పటి క్రేజ్ లేదు. సీనియర్స్ అందరూ వెళ్లిపోయారు. హైపర్ ఆది ఉన్నన్నాళ్ళు సౌమ్యరావుకు చుక్కలు చూపించాడు.