Faima Biography : జీవితమంటే పుల పాన్పు కాదు.. ముళ్ల కంప లాంటిది.. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలుంటాయి. వాటిని అధిగమించికొని ముందుకు వెళ్లినప్పుడే సక్సెస్ సాధిస్తారు. కానీ ఇలాంటి మాటలను కొందరు పట్టించుకోరు. మనసులోకెక్కించుకున్నవారు మాత్రం అత్యున్నత శిఖరానికి చేరుస్తారు. బజర్దస్త్ లో టాప్ కమెడియన్లలో ఒకరైన ఫైమా ఇప్పుడు కోటీశ్వరురాలు. ఇల్లు, కారు, బంగ్లా అన్నీ ఉన్నాయి. జీవితాంతం సంతోషంగా ఉండేందుకు కావాల్సినంత డబ్బు ఉంది. కానీ ఇవి ఊరికే రాలేదు. ఆమె ఎంతో కష్టపడ్డారు.. అలాంటి ఇలాంటి కష్టం కాదు..ఇంట్లో ఒక పూట తిండి తిని.. మరో పూట కడుపుమార్చుకునేంత కష్టం. అయినా ఆమె అధైర్యపడేలేదు. కాలంతో పోరాడి సక్సెస్ జీవితాన్ని అనుభవిస్తున్నారు.
తండ్రి దినసరి కూలి.. తల్లి బీడీలు చడుతూ కుటుంబానికి సాయపడే రోజుల్లో ఫైమా జీవితం మొదలైంది. ఆమె డిగ్రీ చదువుతున్నప్పుుడు కూడా తన జీవితం మారిపోతుందని అస్సలు ఊహించలేదు. కానీ అందరిలాగా తాను ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న పట్టుదల మాత్రం ఉంది. ఇదే సమయంలో ఆమెకు అదృష్టం తలుపు తట్టింది. ఓసారి పటాస్ 2 షో జరుగుతోంది. ఈ సమయంలో తన స్నేహితులతో కలిసి ఈ షో కు వచ్చారు. సాధారణంగా ఆమె పంచ్ కామెడీ చేశారు. ఈ కామెడీ పేలిపోయింది. ఆ తరువాత ఈ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి.
వెంటనే ఫాహిమా కామెడీ కావాలని సోషల్ మీడియాలో రిక్వెస్టులు.. ఇంకేముందీ.. పటాస్ 2 షోలకు ఆహ్వానం అందింది. కానీ ఆమె ఈ షోకు వెళ్లడానికి తల్లిదండ్రులు నిరాకరించారు. ఆ తరువాత రవి, శ్రీముఖి లాంటి వాళ్లు ఫైమా తల్లిని ఒప్పించి ఆమెను పటాస్ 2 షోకు తీసుకొచ్చారు. ఈ షోలో ఆమె చేసిన కామెడీ అదిరిపోయింది. అయితే ఈ షో ఆగిపోయింది. దీంతో ఫాహిమాకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ఇప్పుడేం చేయాలి? అని అనుకుంటున్న తరుణంలో జబర్దస్త్ లో లేడీ గెటప్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలోనే ఫైమాకు పిలుపు వచ్చింది.
ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫైమా జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి ఈమె వెనుదిరిగి చూడలేదు. టాప్ కమెడియన్ల జాబితాలో చేరారు. ఇదే సమయంలో ఆమెకు బిగ్ బాస్ 6 హౌస్ లోకి వెళ్లే ఛాన్స్ వచ్చింది. దీంతో ఆమె మరింత ఫేమస్ అయింది. ఎన్నో కష్టాలు, బాధలను దిగమింగుకొని ముందడుగు వేసిన ఫైమా మొత్తానికి అనుకున్నది సాధించారు. ఇప్పుడు ఆమె సొంతంగా యూట్యూబ్ చానెల్ రన్ చేస్తున్నారు. మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి.
ఇదిలా ఉండగా ఫైమా జీవితంలో ప్రేమాయణం కూడా ఉంది. తనతో కామెడీ స్కిట్ లో పాల్గొన్న ప్రవీణ్ ను ప్రేమించారు. బిగ్ బాస్ 6 హౌస్ లోకి వెళ్లే సమయంలో ప్రవీణ్ తల్లి చనిపోయింది. అంతకుముందే తండ్రి చనిపోయాడు. ఈ సమయంలో తనను విడిచి వెళ్లడం కరెక్ట్ కాదని ఆలోచించింది. కానీ ఆమెకు ప్రవీణ్ నచ్చజెప్పి పంపించాడు. అలా ఫహిమా జీవితం మొత్తానికి ప్రస్తుతం హ్యాపీగా సాగుతోంది. కష్టాల తరువాత సంతోషమైన జీవితం ఉంటుందనడానికి ఫహియా జీవితమే నిదర్శనం.