Jabardasth Faima: జబర్దస్త్ ఫైమా ఆసుపత్రి బెడ్ పై ఉన్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది. దీంతో ఆమెకు ఏమైందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఫైమా పరిచయం అక్కర్లేని పేరు. జబర్దస్త్ వేదికగా ఈమె ఫేమస్ అయ్యారు. తనదైన కామెడీ టైమింగ్ తో ఫైమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. బిగ్ బాస్ షోలో పాల్గొన్న ఫైమా జబర్దస్త్ ని వీడిన విషయం తెలిసిందే. గత ఏడాది ప్రసారమైన సీజన్ 6లో ఫైమా కంటెస్ట్ చేసింది.
ఎలాంటి అంచనాలు లేకుండా హౌస్లో అడుగుపెట్టి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకుంది. ఫైమాతో పాటు అదే సీజన్ లో మరో జబర్దస్త్ కమెడియన్ చంటి పార్టిసిపేట్ చేశాడు. అతడు నాలుగు వారాలకే చాప చుట్టేశాడు. ఫైమా మాత్రం అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ రాణించింది. ఫైమా ఫైనల్ కి వెళ్లడం ఖాయం అనుకున్నారు. అనూహ్యంగా 13వ వారం ఎలిమినేట్ అయ్యింది.
ఫైమా అత్యంత పేద కుటుంబంలో పుట్టింది. అద్దె ఇంట్లో కష్టాలు పడుతూ పెరిగింది. ఫైమా జబర్దస్త్ కి వచ్చాక నిలదొక్కుకుంది. కొత్త ఇంటి నిర్మాణం కూడా చేపట్టినట్లు ఆ మధ్య చెప్పింది. ఇటీవల బీబీ జోడిలో పార్టిసిపేట్ చేసి టైటిల్ కొట్టింది ఫైమా. ఆర్జే సూర్య-ఫైమా జోడికి టైటిల్ తో పాటు రూ. 25 లక్షల ప్రైజ్ మనీ దక్కింది. ఫైమాకు ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది.
ఇదిలా ఉంటే ఫైమా సడన్ గా ఆసుపత్రి బెడ్ పై కనిపించి షాక్ ఇచ్చింది. ఆమె చేతికి సెలైన్ నీడిల్ కూడా ఉంది. దీంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ ఫైమాకు ఎదురైన ఆరోగ్య సమస్య ఏమిటనేది తెలియదు. అభిమానులు మాత్రం ఆమె కోరుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. ఫైమాకు ప్రవీణ్ అనే లవర్ ఉన్నాడు. ఇతడు జబర్దస్త్ లో రాణిస్తున్నాడు. అయితే ప్రవీణ్ తో ఫైమాకు బ్రేకప్ అయ్యిందట.