Comedian Chalaki Chanti: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను బిగ్ రియాల్టీ షో బిగ్ బాస్ ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటి వరకు ఐదు సీజన్లు ప్రసారమవగా… అన్ని సీజన్లు టీఆర్పీ రేటింగుల్లో దూసుకుపోయాయి. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 కూడా అలరించడానికి సన్నద్ధం అయ్యింది. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు, కొత్త లోగో బాగా ఆకట్టుకున్నాయి. పైగా ఈ 6 సీజన్‌కు సంబంధించి చాలా రోజులుగా ఎన్నో రకాల రూమర్లు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 4 నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సీజన్ స్టార్ట్ కానుంది. ఐతే, ఈ సీజన్ 6లోకి జబర్ధస్త్‌లో స్టార్ గా వెలుగొందుతోన్న ఓ కమెడియన్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇంతకీ, అతను ఎవరో తెలిస్తే షాక్ అవుతారు. మరీ ఈ వార్తకు సంబంధించి ఆ కమెడియన్ వివరాలపై ఓ లుక్ వేద్దాం రండి.

అతనే.. జబర్ధస్త్ కమెడియన్ చలాకీ చంటి. చంటిని కంటెస్టెంట్‌గా తీసుకు వస్తున్నారు. అటు జబర్ధస్త్‌లో, ఇటు సినిమాల్లో సత్తా చాటుతోన్న చంటికి మంచి కామెడీ టైమింగ్ ఉంది. అందుకే, అతనికి అత్యధిక రెమ్యూనరేషన్ ఇచ్చి మరీ ఈ షోకి తీసుకు వస్తున్నారు. ఇప్పుడు బుల్లితెర వర్గాల్లో ఇదే హాట్ టాపిక్ అయ్యింది. చంటికి రోజుకు 4 లక్షలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఈ సీజన్ లోనే హియ్యేస్ట్ రెమ్యునరేషన్ అని తెలుస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ ఆరో సీజన్ పనులు మొత్తం పూర్తి అయ్యాయి. పైగా షో హౌస్ సెట్ వర్కును నిర్వహకులు చాలా గ్రాండ్ గా డిజైన్ చేశారు. అలాగే, స్టేజ్‌ను కూడా సుందరంగా తీర్చిదిద్దారు. మొత్తానికి ఈ ఆరో సీజన్ ఎన్నో అంచనాలతో వైభవంగా ప్రారంభం కాబోతుంది. అన్నిటికీ మించి ఈ సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల విషయంలో నిర్వహకులు ఎన్నో వ్యూహాలను అమలు పరచబోతున్నారు.
ఇక ఈ సీజన్ 6 లో పాల్గొనబోయే కంటెస్టెంట్లు ఎవరు అన్నదానిపై ఉత్కంఠ వీడలేదు. మరోవైపు… బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీరేనంటూ ఒక జాబితా కూడా వైరల్ అవుతోంది. ఈ సీజన్‌లో మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ పాల్గొనబోతున్నారు. పైగా ఎంపికైన కంటెస్టెంట్స్ ని అన్నపూర్ణ స్టూడియోస్ లోనే క్వారంటైన్ కి పంపారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన బిగ్ బాస్ గ్రాండ్ సెట్ లో వారిని సెప్టెంబర్ 4 వరకు అక్కడే ఉంచుతారు.

మరి కంటెస్టెంట్స్ వీరే అంటూ వారి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. చూద్దాం వారెవరో అనేది.
1. అజయ్ కుమార్
2. మిత్రా శర్మ
3. ఉదయభాను
4. ఆర్జే చైతూ
5. అనిల్ రాథోడ్
6. దీపిక పిల్లి
7. అమర్ దీప్ చౌదరీ
8. శ్రీహాన్
9 నేహా చౌదరీ
10. ఆర్జే సూర్య
11. ఆది రెడ్డి
12. నిఖిల్ విజేంద్ర
13. చలాకీ చంటీ
15. శ్రీ సత్య
16. ఇనయా సుల్తానా
17. పాండు మాస్టర్