Anchor Anasuya: జబర్దస్త్ కామెడీ షో ప్రస్తుతం తన కళ పోగొట్టుకుంటోంది. సీనియర్ టీం లీడర్లు, యాంకర్లు, కంటెస్టెంట్లు షోను వీడిపోవడంతో ఇక కామెడీ కలలోనే చూస్తామనే భావం ప్రేక్షకుల్లో కనిపిస్తోంది. దీనికి కారణం మల్లెమాల ప్రొడక్షన్ వాళ్లే అని అందరు నిందిస్తున్నారు. మొదట నాగబాబుతో మొదలైన వీడ్కోలు నేటికి కొనసాగుతోంది. సీనియర్లు అందరు షోను వీడిపోతున్నా యాజమాన్యం మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగానే జబర్దస్త్ కు ఇక నూకలు చెల్లినట్లే అనే సమాధానం వస్తోంది. ఒక్కొక్కరుగా వెళ్లిపోవడంతో వారిని ఆపేందుకు చర్యలు తీసుకోవడం లేదు. వారు అడిగినంత పారితోషికం కూడా ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. దీంతోనే వారు షోను వీడిపోతున్నారు.

ఇటీవల గెటప్ శ్రీనును పోకుండా చేసేందుకు శ్యాంప్రసాద్ రెడ్డి రంగంలోకి దిగి చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వచ్చినా అది నిజం కాదని తెలుస్తోంది. దీంతో జబర్దస్త్ షో తన ప్రాభవాన్ని కోల్పోతోంది. మొదట్లో ఉన్న కామెడీ ప్రస్తుతం కనిపించడం లేదు. ఏదో చేశాములే అనే ధోరణిలో టీంలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉన్న వారిలో కూడా నైరాశ్యమే మిగులుతోంది. మల్లెమాల యాజమాన్యం కళాకారుల పట్ల ఏ మాత్రం జాలి చూపడం లేదు. అందుకే వారు ఒక్కొక్కరుగా దారి పడుతూ ఎవరి దారి వారు చూసుకుంటున్నట్లు సమాచారం.
తాజాగా వ్యాఖ్యాత అనసూయ కూడా జబర్దస్త్ ను వీడింది. దీంతో అందరు కన్నీరు పెట్టుకున్నారు. పదేళ్లుగా ఉన్న అనుబంధంతో అందరు కుటుంబ సభ్యుల్లా మెలిగిన నేపథ్యంలో ఆమె షోను వీడటం నిజంగా దురదృష్టమే. దీంతో అందరి కళ్లల్లో కన్నీళ్లు తిరిగాయి. చివరకు జడ్జి ఇంద్రజ కూడా కన్నీటి పర్యంతమయ్యారు. జబర్దస్త్ కు వెన్నెముకగా ఉన్న అనసూయ షోను విడిపోవడమంటే తట్టుకోలేక కంట నీరు పెట్టుకున్నారు. కానీ అనసూయ మాత్రం ఒక్క చుక్క కూడా కార్చకపోవడం విడ్డూరమే.

దీంతో అక్కడున్న వారందరు ఆశ్చర్యానికి గురయ్యారు. అనసూయలో ఇంత కాఠిన్యం ఉందా అని పరేషాన్ అయ్యారు. అందరు ఏడుస్తున్నా ఆమె కంట నీరు రాకపోవడంతో అందరు నోరెళ్లబెట్టారు. జబర్దస్త్ షోలో పలుమార్లు ఏడ్చిన అనసూయ ఇప్పుడు మాత్రం ఎందుకు ఏడ్వటం లేదనే వాదన కూడా వచ్చింది. చివరకు సీనియర్ టీం లీడర్లు రాకెట్ రాఘవ, చలాకీ చంటి కూడా కంట నీరు పెట్టుకున్నా అనసూయ మాత్రం చలించలేదు. దీంతో ఆమె కఠినత్వానికి అందరు బాధపడ్డారు. స్టేజీ మీదే అడిగినా కూడా ఆమెలో కన్నీరు రాకపోవడం విచిత్రమే.