Prema Volunteer: గ్రామ వాలంటీర్ వ్యవస్థను జనసేన, టీడీపీ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీలో మహిళల అదృశ్యం వెనుక పరోక్షంగా వాలంటీర్స్ కారణం అవుతున్నారు. వారు ఒంటరి మహిళల సమాచారం సేకరించి ఆ డేటాను క్రిమినల్స్ చేతిలో పెడుతున్నారని ఆయన అన్నారు. వాలంటీర్ వ్యవస్థ వలన సమాచార భద్రతకు భంగం వాటిల్లుతుంది. పంచాయితీ, రెవెన్యూ వ్యవస్థలు ఉండగా వాలంటీర్, సచివాలయ వ్యవస్థలు అవసరం లేదనేది పవన్ కళ్యాణ్ ప్రధాన వాదన.
పవన్ కళ్యాణ్ ప్రసంగాలపై అధికార పార్టీ మండిపడింది. వాలంటీర్ వ్యవస్థను డిపెండ్ చేసుకునేలా మాట్లాడటం జరిగింది. అసలు వాలంటీర్ వ్యవస్థ ఉండాలా? వద్దా? అనే దానిపై పెద్ద చర్చే జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా పలు సందర్భాల్లో వాలంటీర్స్ చేసిన నేరాలను జనసేన సోషల్ మీడియా హైలెట్ చేసింది. పవన్ కళ్యాణ్ ప్రసంగాల అనంతరం వాలంటీర్స్ పై వ్యతిరేకత వ్యక్తమవుతున్న మాట వాస్తవం. కొందరు తమ సమాచారం వాలంటీర్స్ కి ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు.
వాలంటీర్ వ్యవస్థ మీద ఇంత పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానియేల్ ప్రేమ వాలంటీర్ టైటిల్ తో వెబ్ సిరీస్ ప్రకటించారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. సదరు పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో గ్రామ సచివాలయం బిల్డింగ్ కనిపిస్తుంది. టైటిల్, ఆ పోస్టర్ గమనించిన కొందరు ఇది వాలంటీర్ వ్యవస్థ మీద సెటైరికల్ సిరీస్ కావచ్చంటున్నారు.
వాలంటీర్ వ్యవస్థలోని లోపాలను మరింత క్షుణ్ణంగా జనాలకు అర్థమయ్యేలా చెప్పాలని ప్లాన్ చేశారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఆల్రెడీ వైసీపీ వర్గాలు ఇమ్మానియల్ కి వార్నింగ్స్ ఇస్తున్నారు. ఏదైనా పొలిటికల్ ప్రస్తావన ఉంటే బాగోదని కామెంట్స్ పెడుతున్నారు. ప్రేమ వాలంటీర్ సీరిస్ కి జబర్దస్త్ కమెడియన్ బాబు దర్శకుడు. ఇమ్మానియేల్ హీరోగా చేశాడు. మరి నిజంగా ఇది ఏపీ ప్రభుత్వం మీద సెటైరా లేక కేవలం కామెడీ కోసం చేసిన ప్రయత్నమా… అనేది స్ట్రీమ్ అయితే కానీ తెలియదు.