https://oktelugu.com/

Rajamouli : ఆ సీన్ పవన్ తో తీసుంటే ఆ డైరెక్టర్ ఇండస్ట్రీని ఏలేవాడు… రాజమౌళి హాట్ కామెంట్స్

రాజమౌళి-పవన్ కళ్యాణ్ కాంబోలో మూవీ సాకారం కాలేదు. ఒకసారి కలిసి పవన్ కి కథ అయితే వినిపించాడట. అప్పుడు ఆయన కొన్ని మార్పులు సూచించాడట. మరలా పవన్ ని రాజమౌళి కలిశారట. అప్పటికి ఉన్న కమిట్మెంట్స్ రీత్యా చేద్దాం అని హామీ ఇచ్చారట.

Written By:
  • NARESH
  • , Updated On : July 24, 2023 / 09:23 PM IST
    Follow us on

    Rajamouli : దర్శకుడు రాజమౌళిలో ఉన్న గొప్ప క్వాలిటీ ఎంత ఎదిగిన ఒదిగి ఉండే తత్త్వం. ఆయన టాప్ డైరెక్టర్ అయినప్పటికీ తన తోటి డైరెక్టర్స్ లో ఉన్న టాలెంట్ గురించి ఓపెన్ గా మాట్లాడతారు. పూరి జగన్నాధ్, సుకుమార్ వంటి దర్శకులంటే రాజమౌళికి చాలా గౌరవం. వాళ్ళను పలు సందర్భాల్లో తనకంటే గొప్ప దర్శకులుగా అభివర్ణించారు. కాగా సుకుమార్ కెరీర్ బిగినింగ్ లో చేసిన జగడం మూవీపై రాజమౌళి గతంలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. సుకుమార్ రెండో మూవీ జగడం. ఆర్యతో సూపర్ హిట్ కొట్టిన సుకుమార్… మూడేళ్ళ గ్యాప్ తర్వాత జగడం మూవీ చేశాడు.

    ఇది యాక్షన్ డ్రామా. గ్యాంగ్ స్టర్ గా ఎదగాలనే ఓ యువకుడి కథ. అంచనాల మధ్య విడుదలైన జగడం మెప్పించలేదు. రామ్ పోతినేని హీరోగా నటించాడు. కమర్షియల్ గా నిరాశపరిచినా సినిమాలో విషయం ఉందని ప్రేక్షకులు భావించారు. ఈ సినిమాలో ఒక సీన్ గురించి రాజమౌళి ఆసక్తికర కామెంట్స్ చేశారు. హీరో ఎలివేషన్ కి సంబంధించిన ఆ సీన్ బాగా కుదిరింది. అందరూ భయపడి వెనక్కి పోతుంటే ఓ గ్యాంగ్ కి వ్యతిరేకంగా ధైర్యంగా హీరో నిలుచుంటాడు.

    ఆ ఒక్క పర్టికులర్ సీన్ కి చాలా పొటెన్షియాలిటీ ఉంది. జగడం మూవీ ఆడకపోయినా ఆ సీన్ అద్భుతం. నేను తర్వాత సుకుమార్ ని కలిసి ఆ సీన్ కనుక పవన్ కళ్యాణ్ కి పడుంటే నువ్వు ఇండస్త్రీలో నెంబర్ వన్ హీరో అయ్యేవాడివాడివి అని చెప్పానంటూ…. రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అంటే జగడం మూవీ పవన్ కళ్యాణ్ కి పడి ఉన్నా, గెస్ట్ రోల్ చేసినా ఆ చిత్రం ఇండస్ట్రీ హిట్ అయ్యేదని రాజమౌళి చెప్పకనే చెప్పాడు.

    ఇక రాజమౌళి-పవన్ కళ్యాణ్ కాంబోలో మూవీ సాకారం కాలేదు. ఒకసారి కలిసి పవన్ కి కథ అయితే వినిపించాడట. అప్పుడు ఆయన కొన్ని మార్పులు సూచించాడట. మరలా పవన్ ని రాజమౌళి కలిశారట. అప్పటికి ఉన్న కమిట్మెంట్స్ రీత్యా చేద్దాం అని హామీ ఇచ్చారట. అయితే ఇక పవన్ కళ్యాణ్ నన్ను పిలవలేదు. నా ప్రాజెక్ట్స్ తో నేను బిజీ అయ్యాను. ఈ కారణంగా పవన్ కళ్యాణ్ తో మూవీ కుదర్లేదని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.