Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు…ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి… కెరియర్ స్టార్టింగ్ లో డిఫరెంట్ సినిమాలను చేసిన మహేష్ బాబు ఇప్పుడు మాత్రం కమర్షియల్ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. గత కొన్ని రోజులుగా ఆయన నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించడం లేదు. దాంతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించాలని అనుకున్న మహేష్ బాబు ఎట్టకేలకు రాజమౌళితో జతకట్టాడు. వారణాసి సినిమా విషయంలో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది తెలియాలంటే మరికొద్ది రోజులపాటు వెయిట్ చేయాల్సిందే. ఇక ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ కి ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభించింది. హాలీవుడ్ లో సైతం ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు అంటే ఈ సినిమా ఏ రేంజ్ బజ్ ను క్రియేట్ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా రాజమౌళి లాంటి దర్శకుడు ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది.
ఈ విషయంలో చాలా కేర్ తీసుకుని రాజమౌళి సినిమాలో అంతకుమించిన ఎఫర్ట్స్ పెడుతున్నారట. ఇక ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి మహేష్ బాబు లకు మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధం ఉంది. వీరిద్దరు చాలా సందర్భాల్లో కలుసుకున్నారట. మహేష్ బాబుకి వాళ్ళ నాన్న కృష్ణ గారి తర్వాత అత్యంత ఇష్టమైన హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది చిరంజీవి గారే కావడం విశేషం…
ఇక అప్పుడప్పుడు చిరంజీవి – మహేష్ బాబు కలిసినప్పుడు సినిమాల గురించి చర్చిస్తూ ఉంటారట. ఏదైనా ఫంక్షన్ లో కలిసినప్పుడు కూడా సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారట. మహేష్ బాబులో చిరంజీవికి బాగా నచ్చిన క్వాలిటి ఏంటంటే మహేష్ బాబు పెద్దలను గౌరవిస్తూ ఉంటాడు.
ఆ విషయంలో మహేష్ అత్యుత్తమమైన వ్యక్తిత్వం కలిగిన వాడు అంటూ చిరంజీవి ఎప్పుడు తన సన్నిహితుల దగ్గర గాని, తన కుటుంబం దగ్గర గాని మహేష్ బాబు ప్రస్తావన వచ్చిన ప్రతిసారి చెబుతాడట. మొత్తానికైతే వాళ్ళ తండ్రికి తగ్గ తనయుడు అనే పేరు సంపాదించుకున్నాడు అంటూ చిరంజీవి పలు సందర్భాల్లో మహేష్ బాబు గురించి ప్రస్తావించడం విశేషం…ఇక ప్రస్తుతం ఈ విషయాన్ని తెలుసుకున్న మహేష్ బాబు అభిమానులు ఆనందపడుతున్నారు…
