https://oktelugu.com/

Naga Chaitanya : మా నాన్న తో హీరోయిన్ టబుకి మంచి రిలేషన్ ఉన్న విషయం నిజమే: నాగ చైతన్య

అక్కినేని నాగార్జున మరియు టబు మధ్య ఆరోజుల్లో జరిగిన ప్రేమాయణం. వీళ్ళిద్దరూ కలిసి అప్పట్లో 'నిన్నే పెళ్లాడట' అనే సినిమా లో నటించారు.ఈ సినిమా షూటింగ్ సమయం లోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని అప్పటి మీడియా లో జోరుగా ప్రచారం సాగిన వార్త. వీళ్లకు సంబంధించిన ప్రైవేట్ ఫోటోలు అప్పట్లో లీక్ అయ్యాయి.

Written By: , Updated On : June 4, 2023 / 09:19 AM IST
Follow us on

Naga Chaitanya : మన అందరికీ ఓపెన్ గా తెలిసిన సీక్రెట్స్ లో ఒకటి అక్కినేని నాగార్జున మరియు టబు మధ్య ఆరోజుల్లో జరిగిన ప్రేమాయణం. వీళ్ళిద్దరూ కలిసి అప్పట్లో ‘నిన్నే పెళ్లాడట’ అనే సినిమా లో నటించారు.ఈ సినిమా షూటింగ్ సమయం లోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని అప్పటి మీడియా లో జోరుగా ప్రచారం సాగిన వార్త. వీళ్లకు సంబంధించిన ప్రైవేట్ ఫోటోలు అప్పట్లో లీక్ అయ్యాయి.

ఈ ఫోటోలలో నాగార్జున సతీమణి అమల కూడా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. అంటే వీళ్లిద్దరి మధ్య సాగిన ప్రేమాయణం గురించి అమల కి కూడా తెలుసా?, తెలిసి కూడా ఆమె సైలెంట్ గా ఉందా అనే అనుమానం అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో కలిగింది. అయితే నాగార్జున మరియు టబు మధ్య ఉన్న రిలేషన్ గురించి రీసెంట్ గా నాగార్జున తనయుడు అక్కినేని నాగ చైతన్య చెప్పుకొచ్చాడు.

ఆయన మాట్లాడుతూ ‘ఇండస్ట్రీ నుండి మా కుటుంబానికి ఎంతో దగ్గరైన వ్యక్తి హీరోయిన్ టబు గారు. మా ఫ్యామిలీ మొత్తానికి ఆమె నేను చిన్నతనం లో ఉన్నప్పటి నుండి ఎంతో క్లోజ్. ఇండస్ట్రీ కి చెందిన వారిలా కాకుండా, సొంత కుటుంబ సభ్యులలో ఒకరిగా ఆమె మాతో కలిసి పోయింది.ఇప్పటికీ కూడా పండగల సమయం లో మా ఇంటికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియచేస్తుంది. హైదరాబాద్ కి వచ్చినప్పుడల్లా మా నాన్న గారిని మరియు మమల్ని కలుస్తూనే ఉంటుంది’ అంటూ నాగ చైతన్య చెప్పుకొచ్చాడు.

దీనిని బట్టీ చూస్తే నాగార్జున మరియు టబు కి మధ్య అప్పట్లో నిజంగానే ప్రేమాయణం నడిచిందా?, లేదా బెస్ట్ ఫ్రెండ్స్ గా మాత్రమే ఉన్నారా?, ఒక అమ్మాయి అబ్బాయి మధ్య స్నేహం ఉంటే ఈమధ్య కాలం లో ఏకంగా వాళ్ళ మధ్య ఎదో ప్రేమ సంబంధం ఉన్నట్టుగా చిత్రీకరిస్తుంది మీడియా. అలాగే వీళ్లిద్దరి స్నేహాన్ని కూడా మీడియా అలా తప్పుగా చూపించిందా?, ఒకవేళ మీడియా అలా చూపిస్తే నాగార్జున మరియు టబు ఇదంతా అబద్దం అని ఎందుకు ఇప్పటి వరకు ఖండించలేదు?, ఇత్యాది ప్రశ్నలు ఇప్పటికీ ప్రశ్నలు లాగానే మిగిలిపోయింది కానీ సమాధానం మాత్రం దొరకలేదు.