Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ లో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో తేలిపోయింది!

ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు కంటెస్టెంట్లు. వారికి కూడా మొదటి వారం నుంచి రెమ్యూనరేషన్ అందుతుందట. ఇక రతిక కూడా ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది.

Written By: Suresh, Updated On : November 14, 2023 12:15 pm

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమైన దగ్గర నుంచి ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఎన్నో టాస్క్ లు, ఎమోషనల్, ఎలిమినేషన్ అంటూ సాగిపోతుంది ఈ బిగ్ బాస్ సీజన్. ప్రారంభమైనప్పుడు ఏ రేంజ్ లో టీఆర్పీ రేటింగ్ సాధించిందో.. ఇప్పుడు కూడా ఇంచుమించు అదే రేంజ్ ను సాధిస్తుంది బిగ్ బాస్ సీజన్ 7. చివరి సారి బిగ్ బాస్ కు అసలే రేటింగ్ లేదు. కానీ ప్రస్తుతం మాత్రం మంచి రేటింగ్ తో దూసుకొని పోతుంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఎన్నో వారాలు గడిచిపోయాయి. ప్రతి వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతున్నారు. చివరి వారం భోలే షావలి ఎలిమినేట్ అయ్యారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలుసా?

ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు కంటెస్టెంట్లు. వారికి కూడా మొదటి వారం నుంచి రెమ్యూనరేషన్ అందుతుందట. ఇక రతిక కూడా ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. అయితే మిగిలిన వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వారికి మొదటి వారం నుంచి రెమ్యూనరేషన్ అందుతుందని తెలియడంతో షాక్ అవుతున్నారు నెటిజన్లు. అయితే ఈ వారం ఎలిమినేషన్ లో శివాజీ, పల్లవి ప్రశాంత్ మినహాయించి మిగతా కంటెస్టెంట్లు నామినేషన్ లో ఉన్నారట. ముందు ఫిమేల్ కంటెస్టెంట్లను టార్గెట్ చేసిన బిగ్ బాస్, ఇప్పుడు మేల్ కంటెస్టెంట్లను టార్గెట్ చేశారా అన్నట్టు సాగుతుంది. ఎందుకంటే ముందు మహిళలు ఎలిమినేట్ అయితే.. ప్రస్తుతం పురుషులు అవుతున్న సంగతి తెలిసిందే.

మహిళలు, పురుషులు నామినేట్ అవుతారనే టాక్ ను పక్కన పెడితే ఈ వారం రతిక ఎలిమినేట్ అవుతుందనే సమాచారం అందుతుంది. అయితే శోభాశెట్టి పై ప్రేక్షకుల్లో నెగిటివిటీ ఉందని తెలిసినా.. కొన్ని వారాల పాటు ఆమె హౌజ్ లోనే ఉండబోతుందట. దానికి ఇతరత్రా కారణాలు ఉన్నాయని కూడా టాక్. ఇక కెప్టెన్ శివాజీ నామినేషన్స్ లో నీ టాలెంట్ చూపించు అంటూ రతికను రెచ్చగొట్టి మాట్లాడారు. అలా రతికను, శోభను ఇద్దరిని నామినేట్ చేశారు. మరో వైపు ప్రియాంక జైన్ మాత్రం బిగ్ బాస్ హౌజ్ లో చివరి వారం వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయట.

ఇక బిగ్ బాస్ సీజన్ 7 లో ఉల్టా పుల్టా చాలా ప్లస్ పాయింట్ అయిందని టాక్. ఇందుకు నాగార్జున కూడా చాలా కష్టపడుతున్నారు. ఈ సీజన్ మొదట్లో చాలా ఈ సారి హోస్ట్ గా నాగార్జున కనిపించరు అని ఇతరుల పేర్లు వైరల్ అయ్యాయి. అంతే కాదు వచ్చే సీజన్ కు కూడా కొత్త హోస్ట్ రాబోతున్నారు అనే టాక్ ఉంది. మరి చూడాలి తదుపరి సీజన్ కు ఎలాంటి రెస్పాన్స్ రానుందో.. అయితే ఈ వారం మాత్రం రతిక ఇంట్లో నుంచి వెళ్లిపోవడం ఖాయం అని బిగ్ బాస్ విశ్లేషకుల మాట. మరి చూడాలి దీనిపై ఓ క్లారిటీ రావాలంటే శనివారం వరకు ఆగాల్సిందే.