Nagarjuna : అక్కినేని అభిమానులు ప్రస్తుతం ‘తండేల్'(Thandel Movie) మూవీ సక్సెస్ తో మంచి జోష్ మీద ఉన్నారు. చాలా కాలం నుండి సరైన సూపర్ హిట్ లేక ఇబ్బంది పడుతున్న అక్కినేని ఫ్యామిలీ కి, ఈ సినిమా సక్సెస్ ఇచ్చిన కిక్ మామూలుది కాదు. అంతే కాకుండా శోభిత(Sobhita Dhulipala) ని నాగచైతన్య(Akkineni Nagachaitanya) పెళ్లాడిన తర్వాత అక్కినేని కుటుంబం నుండి వచ్చిన మొట్టమొదటి సినిమా ఇది. ఆ కుటుంబానికి తొలి వంద కోట్ల రూపాయిల గ్రాస్ సినిమా కూడా ఇదే. నాగ చైతన్య విషయం లో అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు కానీ, నాగార్జున విషయం లో మాత్రం సంతోషంగా లేరు. అవతల నాగార్జున తో సరిసమైనమైన ఇమేజ్ ఉన్న చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి వారు నేటి తరం స్టార్ హీరోలతో పోటీ పడుతూ సూపర్ హిట్స్ ని అందుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. కానీ నాగార్జున మాత్రం చాలా సైలెంట్ అయిపోయాడు.
గత ఏడాది సంక్రాంతికి ‘నా సామి రంగ’ చిత్రంతో వచ్చి, పర్వాలేదు అనే రేంజ్ హిట్ ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత ఆయన హీరో గా ఒక్క సినిమాలో కూడా నటించలేదు. రజనీకాంత్(Super star Rajinikanth), లోకేష్ కనకరాజ్(Lokesh Kanakaraj) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘కూలీ'(Coolie Movie) చిత్రంలో విలన్ గా నటిస్తున్న నాగార్జున, ధనుష్- శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘కుభేర’ అనే చిత్రం లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఆయన మైండ్ సెట్ చూస్తుంటే, ఇక హీరో పాత్రలకు టాటా చెప్పి, కేవలం క్యారక్టర్ రోల్స్ కి మాత్రమే పరిమితం అవ్వాలని చూస్తున్నట్టుగా అనిపిస్తుందంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే అక్కినేని నాగార్జున కి సంబందించి ఒక టాప్ సీక్రెట్ ని డైరెక్టర్ అనిల్ రావిపూడి రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో రివీల్ చేయగా, అది సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
నాగార్జున కి ముందుగా అక్కినేని నాగేశ్వర రావు గారు నాగార్జున సాగర్ అనే పేరు పెట్టారట. కానీ నాగార్జున ఇండస్ట్రీ లోకి వచ్చే ముందు సాగర్ క్యాచీగా లేదని, కేవలం నాగార్జున గా స్క్రీన్ నేమ్ గా పెట్టుకున్నాడని చెప్పుకొచ్చాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. బాలకృష్ణ, వెంకటేష్ లకు కెరీర్ లో ఎప్పటికీ మర్చిపోలేని సూపర్ హిట్ చిత్రాలను అందించిన అనిల్ రావిపూడి, త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ లోని వింటేజ్ కామెడీ టైమింగ్ మొత్తాన్ని బయటకి తీస్తానని ‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్ మీట్స్ లో చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి. అయితే అక్కినేని ఫ్యాన్స్ సీనియర్ హీరోలందరితో సినిమాలు తీస్తున్నావ్, మరి మా నాగార్జున తో ఎప్పుడు తీస్తావ్ అని సోషల్ మీడియా లో అడగ్గా, కచ్చితంగా తీస్తాను, ఆయనకు హలో బ్రదర్ లాంటి ఎంటర్టైనర్ ని అందిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు అనిల్ రావిపూడి.