Homeఎంటర్టైన్మెంట్Devi Sri Prasad vsThaman: దేవి శ్రీ ప్రసాద్ చేసిన తప్పు తమన్ చేయడం లేదా..?...

Devi Sri Prasad vsThaman: దేవి శ్రీ ప్రసాద్ చేసిన తప్పు తమన్ చేయడం లేదా..? అందుకే ఎక్కువ ఆఫర్స్ వస్తున్నాయా..?

Devi Sri Prasad vsThaman: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వడం అనేది అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు. ప్రతి విషయంలో క్యాలిక్యులేటెడ్ గా ముందుకు సాగుతూ కష్టాన్ని నమ్ముకొని ఓపికతో ఉన్నప్పుడు మాత్రమే ఇండస్ట్రీలో సక్సెసు లైతే వస్తాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీని సైతం తమ వైపు తిప్పుకుంటున్న స్టార్ హీరోలు చాలామంది ఉన్నప్పటికి ఒక సినిమా సక్సెస్ లో మ్యూజిక్ డైరెక్టర్ సైతం కీలక పాత్ర వహిస్తాడనే విషయం మనలో చాలామందికి తెలియదు. ఒక సినిమా ప్రేక్షకుడికి చేరువవ్వాలంటే ముందు ఆ సినిమాలోని సాంగ్స్ హైలెట్ గా నిలవాలి. అలాంటప్పుడు మాత్రమే సినిమా మీద ప్రతి ప్రేక్షకుడిలో అటెన్షన్ క్రియేట్ అవుతుంది. తద్వారా వాళ్ళు థియేటర్ కి వచ్చి సినిమాను చూసి సూపర్ సక్సెస్ చేసే అవకాశాలైతే ఉన్నాయి…

దేవి శ్రీ ప్రసాద్ లాంటి సంగీత దర్శకుడు దాదాపు 20 సంవత్సరాలుగా తనదైన రీతిలో సత్తా చాటుతున్నాడు. తన తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తమన్ సైతం టాప్ రేంజ్ లో ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక వీరిద్దరి మధ్య చాలా వరకు కాంపిటీషన్ అయితే ఉంది. అయినప్పటికి దేవిశ్రీప్రసాద్ కంటే కూడా తమన్ పెద్ద సినిమాల నుంచి ఆఫర్లనైతే వస్తున్నాయి.

కారణమేంటి అంటే తమన్ చాలా తక్కువ సమయంలో మ్యూజిక్ ని అందిస్తాడు. దర్శకులకు అందుబాటులో ఉండే విధంగా వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి పెడతాడు. తద్వారా షూటింగ్ కు కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఇక రెమ్యునరేషన్ విషయంలో కూడా తమన్ కొంతవరకు తక్కువగానే తీసుకుంటాడనే వార్తలైతే ఉన్నాయి.

అందువల్లే తమన్ కి చాలా వరకు అవకాశాలైతే వస్తున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ మాత్రం ఒక సాంగ్ క్వాలిటీ కోసం ట్యూన్ చేయడానికి ఎక్కువ సమయాన్ని తీసుకుంటారట. అందువల్లే తను ట్యూన్స్ ఇవ్వడంలో కొంతవరకు లేట్ చేస్తాడు. అలాగే రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఆయన చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారనే రూమర్ అయితే ఉంది. కాబట్టి అందుకే తనను పక్కన పెట్టేసి తమన్ కి ఎక్కువ అవకాశాలైతే ఇస్తున్నట్టుగా తెలుస్తోంది… ఇక ప్రస్తుతం దేవి హీరోగా మారాడు. కాబట్టి తమన్ మరింత విజృంభిస్తూ ముందుకు దూసుకెళ్లే అవకాశాలైతే ఉన్నాయి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version