Venu Swamy: వేణు స్వామి.. ఈ పేరు వినగానే ముందుగా జ్యోతిష్యం గుర్తువస్తుంది. ఈయన గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేదు. జ్యోతిష్యం చెబుతూ చాలా ఫేమస్ అయ్యారు. హీరోహీరోయిన్, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ కొన్ని సార్లు భయపెడుతూ..ఎక్కువగా వార్తల్లో నిలిచారు. ఈయన చెప్పిన చాలా విషయాలు నిజం అవడంతో గుడ్డిగా నమ్ముతుంటారు ప్రజలు. ముఖ్యంగా నాగచైతన్య, సమంత విడాకుల విషయంలో వేణు స్వామి చెప్పిన విషయాలు నిజం అవడంతో ఈయనపై పూర్తి విశ్వాసం వచ్చింది. అప్పటి నుంచి వేణు స్వామి చాలా పాపులర్ అయ్యారు.
సమంత నాగ చైతన్య ల విషయంలో ఈయన చెప్పిన జ్యోతిష్యం నిజం అయింది. కానీ ఈ సంవత్సరంలో ఈయన చెప్పిన చాలా విషయాలు నిజం అవలేదు. దీంతో కొందరు ఆయన పై ఫైర్ అవడం మొదలు పెట్టారు. ఇండియా వరల్డ్ కప్ ఈ సారి మనదే అని మాట్లాడారు. కానీ ఈ విషయంలో ఆయన జ్యోతిష్యం నిజం అయింది. సీఎం కేసీఆర్ ఈ సారి సీఎం అవుతారని కూడా చెప్పారు. కానీ ఈ విషయంలో కూడా ఈయన చెప్పింది అబద్ధమని తెలిసింది. ప్రభాస్ జాతకం గురించి కూడా ఈయన మాట్లాడారు.
ప్రభాస్ జాతకంలో శని నడుస్తుందని.. హిట్లు ఉండవని, ప్రభాస్ పని అయిపోయిందని చెప్పుకొచ్చారు. అంతేకాదు పెళ్లి యోగం కూడా లేదన్నారు. పెళ్లి గురించి ముందుముందు తెలుస్తుంది కానీ.. ఇప్పటికి అయితే హిట్లు లేవనే చెప్పడం అబద్దమనే చెప్పాలి. ఎందుకంటే సలార్ విడుదలైన రెండు రోజులకే హిట్ టాక్ తో దూసుకొని పోతుంది. అంటే ఈ విషయంలో వేణు స్వామి చెప్పింది అబద్దమే అని నిర్దారణ అయింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఏంట్రా నువ్వు మా ప్రభాస్ అన్న గురించి చెబుతావా? మా అన్న హిట్లకు నెంబర్ వన్.. నీకేం తెలుసంటూ విమర్శిస్తున్నారు. ఇక పెళ్లి కాదన్నావ్ కదా.. పెళ్లి కనుక జరిగితే ఇంకా ఈయనను ఏ రేంజ్ లో ఆడుకుంటారో ప్రభాస్ ఫ్యాన్స్ అంటూ మరికొందరు ఆవేదన చెందుతున్నారు. మరి చూడాలి రానురాను ఈయన జాతకం ఎలా ఉంటుందో…