Chiranjeevi: భారీ అంచనాల మధ్య నిన్న రిలీజ్ అయిన ప్రభాస్ సలార్ సినిమా మంచి విజయాన్ని దక్కించుకుంది. ఇక అందులో భాగంగానే ప్రభాస్ అభిమానులు మాత్రం ఈ సినిమాని రిపీటెడ్ గా చూడడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా మూడు ఫ్లాప్ లా తర్వాత ప్రభాస్ కి దక్కిన విజయం కాబట్టి ప్రభాస్ అభిమానులు ఈ హిట్ ని చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే సెలబ్రిటీలు సైతం ఈ సినిమాని చూసి సినిమా పైన వాళ్ళ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాను చూసి తనదైన రీతిలో ట్విట్టర్ (ఎక్స్ )లో పోస్ట్ చేశారు…
మై డియర్ దేవా నీ నటనతో బాక్సాఫీస్ ని తగలెట్టేసావ్ ఇక ఈ సినిమాతో మరో మంచి విజయాన్ని అందుకున్నావ్ అంటూ తెలియజేశాడు. అలాగే ప్రశాంత్ నీల్ ని ఉద్దేశిస్తు మై డియర్ ప్రశాంత్ నీల్ నువ్వు అనుకున్నట్టు గానే ఈ సినిమాని చూసే ప్రతి ప్రేక్షకుడిని నీ ప్రపంచంలోకి తీసుకెళ్లావ్… నువ్వు అనుకున్న మాదిరిగానే సినిమాని తీసి సక్సెస్ సాధించావు అంటూ రాసుకు వచ్చాడు. అలాగే ఈ సినిమాలో చేసిన పృథ్వి రాజ్ సుకుమారన్,జగపతి బాబు,శృతిహాసన్ కి తన శుభాకాంక్షలను తెలియజేశాడు…
ఇక ఈ జనరేషన్ హీరోలలో చిరంజీవికి బాగా నచ్చిన హీరో ప్రభాస్ అని చిరంజీవి చాలాసార్లు చెప్పారు. కాబట్టి తన ఫేవరెట్ హీరో సినిమా సక్సెస్ అవ్వడం మీద చిరంజీవి ఇలా తన అభిమానాన్ని చాటుకున్నాడు… ఇక చిరంజీవి లాంటి ఒక స్టార్ హీరో ఇలా ప్రభాస్ పైన ప్రశంశల వర్షం కురిపిస్తుండడంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక చిరంజీవి తో పాటు చాలా మంది సెలబ్రిటీలు కూడా ఈ సినిమా సక్సెస్ ని పురస్కరించుకొని సలార్ టీమ్ కి బెస్ట్ విషెస్ ని తెలియజేస్తున్నారు…
ఇక ఈ సినిమా రిలీజ్ అయింది కాబట్టి ప్రభాస్ తన నెక్స్ట్ సినిమాగా కల్కి సినిమా మీద ఎక్కువగా టైం స్పెండ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా పూర్తి అయితే ఆ తర్వాత స్పిరిట్ సినిమా మీదకి వెళ్ళిపోతారు. ఇలా ఒక్కో సినిమాని కంప్లీట్ చేసుకుంటూ రావాలి అనే ఉద్దేశ్యం లో ప్రభాస్ ఉన్నట్టుగా తెలుస్తుంది…ఇక నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చే కల్కి సినిమా కూడా సూపర్ సక్సెస్ కొట్టడానికి రెఢీ అవుతున్నట్టు గా తెలుస్తుంది….