Homeఎంటర్టైన్మెంట్Vijay Deverakonda: విజయ్ దేవరకొండ సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంటున్నారా? కారణం ఏంటి?

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ సంక్రాంతి రేస్ నుంచి తప్పుకుంటున్నారా? కారణం ఏంటి?

Vijay Deverakonda: యంగ్ హీరో రౌడీ భాయ్ విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గీతా గోవిందం సినిమా హిట్ అవడంతో ఈ హీరో రేంజ్ ఎక్కడికో పెరిగింది. కానీ ఆ తర్వాత కొన్ని సినిమాలు ఫ్లాప్ అవడంతో ఢీలా పడ్డాడు. ఫ్లాప్ లతో బాధ పడుతున్న రౌడీ భాయ్ కు ఖుషీ సినిమా ఖుషీని పంచింది అనే చెప్పాలి. ఈ సినిమా సక్సెస్ తర్వాత మరో రెండు సినిమాలు సెట్స్ మీదకు వెళ్లాయి. అందులో పరశురామ్ తో చేస్తున్న ప్రాజెక్ట్ ఒకటి. ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి.

విజయ్, పరశురామ్ కాంబినేషన్ లో వచ్చిన గీతా గోవిందం ఘన విజయం అందుకుంది. మరి సూపర్ హిట్ కాంబో కావడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగా నెలకొన్నాయి. ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో విజయ్ కు జోడీగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమా గురించి తాజాగా నెట్టింట ఓ అప్డేట్ వైరల్ గా మారింది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మరి దిల్ రాజు నిర్మాత కావడంతో ఈ సినిమాను ఎలాగైనా సంక్రాంతి రేసులోనే నిలిపేందుకు మేకర్స్ టైం ఫిక్స్ చేసుకొని సంక్రాంతికే రిలీజ్ అని కూడా ప్రకటించారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నట్టు టాక్ వినిపిస్తుంది. అందుకు కారణం ఈ సినిమా షూట్ అయిపోలేదని తెలుస్తోంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో షూట్ మొత్తం పూర్తవదని.. అందుకే సినిమాను వాయిదా వేయాలని చూస్తున్నారట మేకర్స్. ఇక షూటింగ్ డిలే అవడం వల్ల ఈ సారి దిల్ రాజు సంక్రాంతి పండుగ టార్గెట్ మిస్ చేసినట్టు తెలుస్తోంది. చూడాలి మేకర్స్ ఈ రూమర్స్ విషయంలో ఎలా స్పందిస్తారో..

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version