Trivikram Venkatesh Movie Story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని సంపాదించుకున్న నటుడు వెంకటేష్… ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప విజయాలను సాధించి పెట్టడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సైతం వెంకటేష్ కంటూ ఒక సెపరేట్ ఇమేజ్ ను తీసుకువచ్చాయి… త్రివిక్రమ్ వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు మంచి విజయాలను సాధించాయి. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు త్రివిక్రమ్ రైటర్ గా వ్యవహరించిన విషయం మనకు తెలిసిందే. కానీ త్రివిక్రమ్ డైరెక్షన్ లో వెంకటేష్ ఇప్పటివరకు నటించలేదు. మొదటిసారి ఈ కాంబో కలిసి వస్తుండటం తో ఫ్యామిలీ ఆడియన్స్ సైతం ఈ సినిమా మీద చాలా అంచనాలైతే పెట్టుకున్నారు. ఎందుకంటే వీళ్లిద్దరూ ఫ్యామిలీ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ‘ఆదర్శ కుటుంబం’ అనే పేరుతో ఒక సినిమా చేస్తున్నారు.
ఈ సినిమా కథ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమా కథ ఏంటి అనే విషయాన్ని తెలుసుకోడానికి చాలామంది ప్రయత్నాలైతే చేస్తున్నారు… బాగా ఉన్నత కుటుంబం గా బతుకుతున్న ఒక ఫ్యామిలీకి అనుకోకుండా ఒక రోజు ఒక పెద్ద ప్రాబ్లం అయితే వస్తోంది.
ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం ఎవరి వల్ల కాదు. అలాంటి సమయంలో ఆ ఫ్యామిలీకి దూరపు రిలేషన్ అయిన వెంకటేష్ వచ్చి ఆ ఫ్యామిలీకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తొలగిస్తారట. అయితే ఇది రొటీన్ సినిమా స్టోరీ లానే కనిపిస్తున్నప్పటికి దీనికి త్రివిక్రమ్ స్టైల్ లో ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు. ఇక మొత్తానికైతే ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని మెప్పిస్తుంది అనే కాన్ఫిడెంట్ తో అటు వెంకటేష్, ఇటు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉండడం విశేషం…
వెంకటేష్ 2025 వ సంవత్సరంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాతో భారీ విజయాన్ని సాధించాడు. ఇప్పుడు చిరంజీవితో కలిసి ‘మన శంకర్ వర ప్రసాద్ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు… ఇక త్రివిక్రమ్ డైరెక్షన్లో చేస్తున్న సినిమాతో కూడా భారీ విక్టరీని సాధించాలనే ప్రయత్నంలో ఉన్నాడు…