Kamal Haasan- Aditya 369: నందమూరి బాలకృష్ణ గారు ఎన్ని సినిమాలు చేసిన..భవిష్యత్తు లో ఎన్ని సినిమాలు తీసిన ఆ కెరీర్ లో ఆదిత్య 369 సినిమా లాంటిది మరొకటి రాదు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు..మన టాలీవుడ్ లో పెద్దగా టెక్నాలజీ లేని సమయం లోనే మహానుభావుడు సింగీతం శ్రీనివాస రావు గారు 20 ఏళ్ళు అడ్వాన్స్ గా ఆలోచించి తెరకెక్కించిన చిత్రం ఇది..అప్పటి తరం ప్రేక్షకులు ఎక్కువగా 6 పాటలు, 4 ఫైట్లు ఉండే సినిమాలు చూస్తూ వాటికే బాగా అలవాటు పడిపోయారు.

అలాంటి సమయంలో టాలీవుడ్ టాప్ 2 మాస్ హీరోలలో ఒకరైన నందమూరి బాలకృష్ణ వంటి కమర్షియల్ స్టార్ హీరో ని పెట్టి ఒక టైం ట్రావెల్ సైంటిఫిక్ చిత్రాన్ని తియ్యడమే పెద్ద సాహసం అనుకుంటే..తీసి పెద్ద హిట్ కొట్టడం మరో వింత..ఇందులో నందమూరి బాలకృష్ణ గారి నటన అద్భుతం..కృష్ణ కుమార్ గా మరియు శ్రీకృష్ణ దేవరాయలు గా బాలయ్య బాబు ఎంతో చక్కగా నటించారు.
అయితే ఈ సినిమాని తొలుత మల్టీస్టార్ర్ర్ చిత్రం గా తీద్దాం అనుకున్నాడు డైరెక్టర్..ఒక పాత్ర కి బాలయ్య బాబు ఫిక్స్..అది కృష్ణ కుమార్ పాత్ర..శ్రీ కృష్ణ దేవరాయలు గారి పాత్రని తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ కోసం అడిగారు..కానీ అప్పటికే ఆయన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి..సింగీతం గారితో పని చెయ్యడం ఆయన కోరిక అయ్యినప్పటికీ కూడా డేట్స్ సర్దుబాటు చెయ్యలేక ఆ సినిమాని వదులుకోవాల్సి వచ్చింది..అయితే ఆ తర్వాత పలువురి హీరోలను కూడా సంప్రదించారు కానీ ఎవ్వరు అంగీకరించలేదు..చివరికి సింగీతం గారు ఆ పాత్ర ని బాలయ్య బాబు తోనే చేసాడు.

శ్రీ కృష్ణ దేవరాయలు పాత్రని తానూ తప్ప ఎవ్వరు వెయ్యలేరు అనేంత గొప్పగా ఆ పాత్ర బాలయ్య బాబు కి నప్పింది..కానీ ఒకవేళ ఈ సినిమా కమల్ హాసన్ చేసి ఉంటె అప్పట్లోనే పాన్ ఇండియా లెవెల్ లో అన్ని ప్రాంతీయ బాషలలో విడుదల చేద్దామనే ఆలోచనలో ఉండేవాడట సింగీతం..కానీ బ్యాడ్ లక్..ఈ సినిమాకి సీక్వెల్ చెయ్యాలనేది బాలయ్య బాబు కోరిక..ఇందులో ఆయన కుమారుడు మోక్షజ్ఞ హీరో గా నటించే అవకాశాలు కూడా ఉన్నాయి..చూడాలి మరి అది నిజం అవుతుందో లేదో అనేది.