https://oktelugu.com/

Buchibabu And Ram Charan: రామ్ చరణ్ బుచ్చి బాబు సినిమాకి దేవి ని పక్కన పెట్టి రెహమాన్ ని తీసుకోవడానికి కారణం ఇదేనా..?

రామ్ చరణ్ తో బుచ్చి బాబు చేసే సినిమా సమ్మర్ లో సెట్స్ పైకి వెళుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమా యూనిట్ సినిమాకి సంబంధించిన అన్ని పనులను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : January 6, 2024 / 05:42 PM IST

    Buchibabu And Ram Charan

    Follow us on

    Buchibabu And Ram Charan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామ్ చరణ్ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన చేసిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్నాయి. ఇక అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన శంకర్ డైరెక్షన్ లో గేమ్ చెంజర్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక దాంతో పాటుగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఇంతకు ముందు బుచ్చిబాబు ఉప్పెన అనే సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.

    అయితే ఇప్పుడు రామ్ చరణ్ తో బుచ్చి బాబు చేసే సినిమా సమ్మర్ లో సెట్స్ పైకి వెళుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమా యూనిట్ సినిమాకి సంబంధించిన అన్ని పనులను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. అయితే బుచ్చిబాబు సుకుమార్ రైటింగ్స్ నుంచి వచ్చిన డైరెక్టర్ కాబట్టి ఉప్పెన సినిమాని సుకుమార్ రైటింగ్స్ తోపాటు మైత్రి మూవీ మేకర్స్ కలిసి ప్రొడ్యూస్ చేశారు. అలాగే ఇప్పుడు ఈ సినిమాకి మైత్రి మూవీ మేకర్స్ వాళ్లు ప్రొడ్యూస్ చేస్తున్నారు. నిజానికి ఉప్పెన సినిమా టైంలోనే బుచ్చిబాబు తో మరొక సినిమా కూడా వాళ్ల బ్యానర్ లోనే చేయాలని మైత్రి వాళ్ళు అగ్రిమెంట్ కూడా కుదుర్చుకున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఏ ఆర్ రెహమాన్ ని తీసుకున్నారు.ఈ రోజు ఏఆర్ రెహమాన్ గారి బర్త్ డే అవడం వల్ల మ్యూజిక్ సిట్టింగ్స్ కి తనని ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. ఓకే ఇప్పటికే రెహమాన్ సినిమా కోసం మూడు సాంగ్స్ ని రెడీ చేసి పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది.అయితే సుకుమార్ రైటింగ్స్ అంటే అందరికీ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గుర్తుకు వస్తాడు అలాగే సుక్కు దేవి కాంబో లో వచ్చిన చాలా సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ లుగా నిలిచాయి. అలాగే ఆ సినిమాలో సాంగ్స్ కూడా సూపర్ సక్సెస్ అయ్యాయి.

    ఇక ఇలాంటి క్రమంలో బుచ్చిబాబు మాత్రం ఈ సినిమా కోసం ఏఆర్ రెహమాన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవడానికి కారణం ఏంటి అనే దానిమీద అభిమానుల్లో ఇప్పుడు చాలా పెద్ద చర్చ జరుగుతుంది. అయితే బుచ్చిబాబు చేసిన ఉప్పెన సినిమాకి కూడా దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నాడు.ఆ సినిమా సక్సెస్ లో ఆయన ఇచ్చిన మ్యూజిక్ కూడా చాలా హెల్ప్ అయింది. ఇక ఇప్పుడు మాత్రం తనని తీసుకోకపోవడం వెనుక కారణం ఏంటంటే ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. కాబట్టి రెహమాన్ అయితే మ్యూజిక్ కొంచెం ఫ్రెష్ గా ఉంటుందనే ఉద్దేశ్యం తోనే బుచ్చిబాబు తనని తీసుకున్నట్టుగా తెలుస్తుంది.