https://oktelugu.com/

Ram Charan : రామ్ చరణ్ ను షారూఖ్ ఖాన్ అవమానించడం వెనుక అసలు కారణం ఇదేనా..?

ముఖేష్ అంబానీ కొడుకు అయిన అనంత్ అంబానీ వెడ్డింగ్ ఈవెంట్ లో భాగంగా తెలుగులో స్టార్ హీరో అయిన రామ్ చరణ్ ఉపాసనతో కలిసి సతీ సమేతంగా ఆ పార్టీకి అటెండ్ అయ్యాడు. ఇక అక్కడ షారుక్ ఖాన్ రామ్ చరణ్ ని పిలుస్తూ ఇడ్లీ, సాంబార్ అంటూ చులకనగా మాట్లాడటం చూసిన ఉపాసన హర్ట్ అయ్యారు. వెంటనే ఆమె ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఇక ఆమె ఆ తర్వాత షారుక్ గురించి మాట్లాడిన మాటల మీద కూడా స్పందించడం విశేషం...ఇక ఇదిలా ఉంటే చాలా సంవత్సరాల నుంచి మేమే తోపులం అని ఫీల్ అయిపోయే బాలీవుడ్ హీరోలు..

Written By:
  • NARESH
  • , Updated On : March 6, 2024 / 09:14 PM IST
    Follow us on

    Ram Charan : చాలా రోజుల నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీ సౌత్ సినిమాలను తక్కువ చేసి చూడడం మనం ఇప్పటికీ చాలా సార్లు చూశాం… అవకాశం దొరికిన ప్రతిసారి మన సినిమాల మీద, మన హీరోల మీద పంచులు వేసే బాలీవుడ్ హీరోలు మరోసారి మన హీరోల మీద విషాన్ని కక్కే ప్రయత్నం అయితే చేశారు…

    ప్రస్తుతం తెలుగు సినిమా స్థాయి బాలీవుడ్ ను కూడా దాటేయడం తో వాళ్లకి ఏం చేయాలో అర్థం కాక ఏదో ఒక రకంగా మన వాళ్ళ మీద కోపాన్ని వెళ్లగక్కుతున్నారు. ఇక అందులో భాగంగానే గ్లోబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న మన తెలుగు స్టార్ హీరో అయిన ‘రామ్ చరణ్ ‘ మీద షారుక్ ఖాన్ కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది..

    ముఖేష్ అంబానీ కొడుకు అయిన అనంత్ అంబానీ వెడ్డింగ్ ఈవెంట్ లో భాగంగా తెలుగులో స్టార్ హీరో అయిన రామ్ చరణ్ ఉపాసనతో కలిసి సతీ సమేతంగా ఆ పార్టీకి అటెండ్ అయ్యాడు. ఇక అక్కడ షారుక్ ఖాన్ రామ్ చరణ్ ని పిలుస్తూ ఇడ్లీ, సాంబార్ అంటూ చులకనగా మాట్లాడటం చూసిన ఉపాసన హర్ట్ అయ్యారు. వెంటనే ఆమె ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. ఇక ఆమె ఆ తర్వాత షారుక్ గురించి మాట్లాడిన మాటల మీద కూడా స్పందించడం విశేషం…ఇక ఇదిలా ఉంటే చాలా సంవత్సరాల నుంచి మేమే తోపులం అని ఫీల్ అయిపోయే బాలీవుడ్ హీరోలు..

    ప్రస్తుతం వాళ్ళు సినిమాలతో సక్సెస్ కొట్టలేక ఢీలా పడిపోతున్నారు. మరీ ముఖ్యంగా మన తెలుగు హీరోలని డామినేట్ చేయడంలో చాలా వెనుకబడి పోతున్నారు.కాబట్టి ఖాన్ త్రయం అయితే చాలా డిప్రెషన్ లోకి వెళ్లి పోయారు. దాంతో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక మన వాళ్ళని ఏదో ఒక రకంగా మాటలు అంటూ వాళ్ళు హైలెట్ అవ్వాలని చూస్తున్నారు. కానీ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడం వల్ల అది వాళ్ళకే మైనస్ అవుతుంది. తప్ప మన హీరోలకి ఏం అవ్వదు అంటూ సినీ విశ్లేషకులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…