Pawan Kalyan -Rajinikanth : నేటి తరం స్టార్ హీరోలలో అత్యధిక రీమేక్ సినిమాలు చేసిన హీరో ఎవరు అంటే ప్రతీ ఒక్కరికీ గుర్తుకు వచ్చే పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈయన కెరీర్ సుమారుగా 8 కి పైగా చిత్రాలను రీమేక్ చేసాడు. రాజకీయాల్లోకి వెళ్లి మళ్ళీ సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన చేసిన మూడు సినిమాలు కూడా రీమేక్ సినిమాలే అవ్వడం విశేషం. ఓటీటీ కాలం లో రీమేక్ సినిమాలు ఆడటం లేదు అనే విషయం అందరికీ తెలిసిందే.
కానీ పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాలు మాత్రం ఓపెనింగ్స్ దగ్గర నుండి క్లోసింగ్ వరకు టికెట్ రేట్స్ తో సంబంధం లేకుండా వసూళ్లను రాబడుతున్నాయి. ఇది సాధారణమైన విషయం కాదు. కానీ అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ తోటి స్టార్ హీరోలు పాన్ ఇండియా పాన్ వరల్డ్ రేంజ్ సినిమాలు చేస్తుంటే, ఈయన మాత్రం కేవలం రీమేక్ సినిమాలకే పరిమితం అవ్వడం అనేది వాళ్లకు నచ్చడం లేదు.
అయితే గతంలో పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో మైలు రాయిగా నిల్చిన చిత్రం ‘భాషా’ సినిమాని నేటి తరం ఆడియన్స్ కి తగ్గట్టుగా మార్పులు మరియు చేర్పులు చేసి 2010 వ సంవత్సరం లో రీమేక్ చేయాలని అనుకున్నాడట. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని కూడా అప్పట్లో ప్రారంభించారు, అయితే ఈ విషయం మెగాస్టార్ చిరంజీవి కి తెలిసింది.
వెంటనే పవన్ కళ్యాణ్ ని పిలిపించి, ఇలాంటి వృథా సాహసాలు చెయ్యకు, ఇవి ఆల్ టైం క్లాసికల్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు, తెలుగు లో కూడా ఈ చిత్రాన్ని ఎగబడి చూసారు, అలాంటి సినిమాని రీమేక్ చేయాలనుకోవడం సాధారణమైన విషయం కాదు, ఒక్కసారి ఆలోచించుకో అని చెప్పాడట. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా రెండు మూడు టెస్ట్ షూట్ వీడియోలు చేసి , దానిని చూసిన తర్వాత అన్నయ్య చెప్పిందే కరెక్ట్ అని అర్థం చేసుకొని , బాషా సినిమాని రీమేక్ చేసే ఆలోచనని పక్కన పెట్టేసాడట.