Mahesh Babu and Priyanka Chopra: ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సినీ అభిమానులు రేపు రామోజీ ఫిల్మ్ సిటీ లో ఘనంగా జరగబోయే #Globetrotter ఈవెంట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మహేష్(Super Star Mahesh Babu),రాజమౌళి(SS Rajamouli) కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్ వంటి వారు కూడా నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రం లో ఎవరెవరు నటిస్తున్నారు?, ఎలాంటి టెక్నీషియన్స్ పని చేయబోతున్నారు అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. ఇప్పటికే ప్రియాంక మరియు పృథ్వీ రాజ్ లకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ ని విడుదల చేయగా వాటికి ఆడియన్స్ నుండి ఫ్యాన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఈ రెండు పోస్టర్స్ పై ఫన్నీ మీమ్స్ కూడా చాలానే వచ్చాయి. అదే విధంగా నాలుగు రోజుల క్రితం విడుదల చేసిన ‘సంచారి’ థీమ్ మ్యూజిక్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఈ సినిమా గురించి కాసేపు పక్కన పెడితే ఈ చిత్రానికి ముందే మహేష్ బాబు, ప్రియాంక చోప్రా కాంబినేషన్ లో ఒక సినిమా రావాల్సి ఉందట. ఆ చిత్రం మరేదో కాదు ‘నాని’. SJ సూర్య దర్శకత్వం లో మహేష్ బాబు, అమీషా పటేల్ హీరో హీరోయిన్లు గా నటించిన ఈ సినిమా అప్పట్లో పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ముందుగా ప్రియాంక చోప్రా నే సంప్రదించారట. ఆమెకు కూడా మహేష్ తో కలిసి నటించాలని ఉండేదట, ఛాన్స్ రాగానే నటించడానికి సిద్దమే కానీ, డేట్స్ క్లాష్ రావడం తో ఆయన చిత్రం లో నటించే ఛాన్స్ ని పోగొట్టుకుంది. ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో స్థిరపడి ఉండొచ్చు కానీ, ఆమె కెరీర్ మొదలైంది సౌత్ ఇండియన్ సినిమా ద్వారానే. అప్పట్లో తమిళ హీరో విజయ్ నటించిన ‘తమీజాన్’ చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది.
ఆ తర్వాత బాలీవుడ్ లో అవకాశాలు రావడం, ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రెండేళ్లకే స్టార్ హీరోయిన్ గా మారిపోవడం వల్ల, వరుసగా స్టార్ హీరోల సినిమాల్లోనే అవకాశాలు వచ్చేవి. అలాంటి సమయం లో ఆమె నాని చిత్రానికి డేట్స్ కేటాయించలేకపోయింది. ఆ సమయం లో అమీషా పటేల్ కూడా ఫుల్ బిజీ గానే ఉండింది కానీ, ఆమెకు కాస్త గ్యాప్ దొరకడం తో ఈ సినిమాలో నటించేందుకు అంగీకారం తెలిపింది. అలా ఆరోజుల్లో మహేష్, ప్రియాంక చోప్రా కాంబినేషన్ మిస్ అయింది. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబినేషన్ లో పాన్ వరల్డ్ చిత్రం తెరకెక్కుతుంది. మందాకినీ క్యారక్టర్ లో ప్రియాంక చోప్రా తన నట విశ్వరూపం చూపిస్తుందని అంటున్నారు. చూడాలి మరి వీళ్ళ కాంబినేషన్ వెండితెర పై ఎలా ఉండబోతోంది అనేది.