Junior NTR craze in Pakistan : పాకిస్థాన్ లో జూనియర్ ఎన్టీఆర్ కి ఇంత క్రేజ్ ఉందా..? సోషల్ మీడియా ని ఊపేస్తున్న వీడియో!

పాకిస్థాన్ లోని ఒక కేఫ్ లో ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత చిత్రాన్ని అక్కడి జనాలు టీవీ లకు అత్తుక్కుపోయి చూస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అభిమానులు దీనిని షేర్ చేస్తూ ఎన్టీఆర్ క్రేజ్ పాకిస్థాన్ లో కూడా ఎలా ఉందో మీరే చూడండి అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.

Written By: Vicky, Updated On : October 23, 2024 6:54 pm

Junior NTR craze in Pakistan

Follow us on

Junior NTR craze in Pakistan :  #RRR చిత్రం తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ క్రేజ్ గ్లోబల్ వైడ్ గా బాగా వ్యాప్తి చెందింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వీళ్లిద్దరు ఇప్పుడు కేవలం టాలీవుడ్ ఆడియన్స్ కి మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో ఉండే సినీ అభిమానులకు కూడా రోల్ మోడల్స్. ముఖ్యంగా ఎన్టీఆర్ ‘దేవర’ చిత్రం తో తన సత్తా ఏంటో మరోసారి అందరికీ చూపించాడు. యావరేజ్ టాక్ తో మొదలైన ఈ సినిమా, 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. ఇప్పటికీ ఈ సినిమా థియేటర్స్ లో విజయవంతంగా నడుస్తూ డీసెంట్ గ్రాస్ వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. దీపావళి రోజున కూడా ఈ సినిమాకి మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉంది.

నాల్గవ వీకెండ్ లో వచ్చిన ఆదివారం రోజు కూడా ఈ చిత్రం కోటి రూపాయిల షేర్ ని రాబట్టింది. ఇదంతా పక్కన పెడితే ఎన్టీఆర్ పాకిస్థాన్ లో కూడా క్రేజ్ ఉంది అనే విషయం మీకు ఎవరికైనా తెలుసా?, పాకిస్థాన్ లోని ఒక కేఫ్ లో ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత చిత్రాన్ని అక్కడి జనాలు టీవీ లకు అత్తుక్కుపోయి చూస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అభిమానులు దీనిని షేర్ చేస్తూ ఎన్టీఆర్ క్రేజ్ పాకిస్థాన్ లో కూడా ఎలా ఉందో మీరే చూడండి అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఈమధ్య కాలం లో ఓటీటీ లలో మన ప్రతీ తెలుగు సినిమాని హిందీ లో దబ్ చేసి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. మన సినిమాలు బాంగ్లాదేశ్, పాకిస్థాన్ సినీ ప్రియులు అమితంగా ఇష్టపడుతారు. నెట్ ఫ్లిక్స్ ట్రెండింగ్ ఒక్కసారి గమనిస్తే ఈ విషయం అందరికీ అర్థం అవుతుంది. అలాగే యూట్యూబ్ లో మన తెలుగు సినిమాలను హిందీలో దబ్ చేసి అప్లోడ్ చేస్తుండడం మనమంతా గమనించాము.

వీటికి వందల కొద్దీ మిలియన్ల వ్యూస్ వస్తుంటాయి. ఈ వ్యూస్ కేవలం ఇండియన్స్ చూస్తే వచ్చేది కాదు, బాంగ్లాదేశ్ , పాకిస్థాన్ మరియు ఇతర అరబ్ కంట్రీస్ వాళ్ళు చూస్తే వచ్చినవే. ఆ విధంగా జూనియర్ ఎన్టీఆర్ తో పాటు మిగిలిన టాలీవుడ్ స్టార్ హీరోలందరూ అక్కడి ఆడియన్స్ కి సుపరిచితం. ముఖ్యంగా ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ సినిమాలు అంటే అక్కడి ఆడియన్స్ చొక్కాలు చింపేసుకుంటారు. అల్లు అర్జున్ వి కొన్ని చిత్రాలు అక్కడి థియేటర్స్ లో విడుదలై సూపర్ హిట్స్ సాధించినవి కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, రవితేజ సినిమాలను కూడా వాళ్ళు బాగానే చూస్తారు. ఇప్పుడు మన మార్కెట్ పాన్ వరల్డ్ రేంజ్ కి చేరుకోవడంతో మన హీరోలకు ఇంకా మంచి రీచ్ పెరిగింది అనే చెప్పాలి. ఇది ఇలా ఉండగా సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న పాకిస్తాన్ ఎన్టీఆర్ అరవింద సమేత వీడియోని క్రింద అందిస్తున్నాము, మీరు కూడా చూసేయండి.