Trivikram Srinivas: గుంటూరు కారం ప్లాప్ తో గురూజీ నెక్స్ట్ సినిమా మీద క్లారిటీ రావడం లేదా..?

సినిమా ఇండస్ట్రీలో ఒక హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో హీరోలు సనిహిత్యంగా ఉంటారు. అదే ఒక ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ కనిపిస్తే మాత్రం ఆయనతో మాట్లాడడానికి కూడా హీరోలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు దానికి కారణం సక్సెస్...ఇక అదే కారణంతో త్రివిక్రమ్ ని మహేష్ బాబు దూరం పెడుతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

Written By: Gopi, Updated On : January 28, 2024 11:18 am
Follow us on

Trivikram Srinivas: ఈ సంక్రాంతికి భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గుంటూరు కారం సినిమా ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది. దానికి కారణాలు ఏవైనా కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇమేజ్ మాత్రం ఈ సినిమా వల్ల కొంచెం డ్యామేజ్ అయిందనే చెప్పాలి. ఇంతకు ముందు ఆయన చేసిన సినిమాలు అంతో ఇంతో ఆయన ఇమేజ్ ని పెంచితే ఈ సినిమా మాత్రం చాలావరకు తగ్గించిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాతో మహేష్ బాబు కి భారీ హిట్టిస్తానని చెప్పిన త్రివిక్రమ్, ఇప్పుడు ప్లాప్ ఇవ్వడం పట్ల మహేష్ బాబు అభిమానులు త్రివిక్రమ్ మీద తీవ్రమైన కోపంతో ఉన్నారు. ఈ సినిమా పట్ల గురూజీ తన స్పందన తెలియ చేయకపోవడంతో మహేష్ కి త్రివిక్రమ్ కి మధ్య మాటలు లేవా అనే వార్తలు బయట బాగా స్ప్రెడ్ అవుతున్నాయి.

సినిమా ఇండస్ట్రీలో ఒక హిట్ ఇచ్చిన డైరెక్టర్ తో హీరోలు సనిహిత్యంగా ఉంటారు. అదే ఒక ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ కనిపిస్తే మాత్రం ఆయనతో మాట్లాడడానికి కూడా హీరోలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు దానికి కారణం సక్సెస్…ఇక అదే కారణంతో త్రివిక్రమ్ ని మహేష్ బాబు దూరం పెడుతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మొత్తానికైతే మహేష్ బాబు కెరియర్ లో త్రివిక్రమ్ ఇప్పటి వరకు మూడు సినిమాలు చేసి మూడు సార్లు మహేష్ బాబుకు చేదు అనుభవాన్ని మిగిల్చాడు. ఒక వంతుకు అతడు సినిమా ఓకే అనిపించినప్పటికీ ఖలేజా, గుంటూరు కారం సినిమాలు మాత్రం ఫ్లాప్ అయ్యాయి.

ఆ సినిమాలు చూసినవారు ఓకే బాగున్నాయి అని అంటున్నప్పటికీ, కమర్షియల్ గా మాత్రం ఆ సినిమాలు వర్కౌట్ కాలేదనే చెప్పాలి. ఇక దానివల్లే వీళ్ళ కాంబినేషన్ లో ఇక మీదట మరో సినిమా రాకపోవచ్చు. ఇక అలాగే అల్లు అర్జున్ తో చేసే సినిమా కూడా ఉంటుందా లేదా అనే డైలామాలో అయితే త్రివిక్రమ్ ఉన్నాడు. ఇక ఇప్పటికే మహేష్ బాబు సినిమాతో భారీ ఫ్లాప్ ను అందుకున్న త్రివిక్రమ్ అల్లు అర్జున్ సినిమా చేస్తాడా లేదా అనేది కూడా క్లారిటీగా తెలియాల్సి ఉంది.

ఇక ఈ క్రమంలోనే అల్లు అర్జున్ బోయపాటితో సినిమాకి రెడీ అవుతున్నాడు. మరి వీళ్ళిద్దరిలో అల్లు అర్జున్ ఎవరితో ముందుగా సినిమా చేస్తాడు అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు…