Allu Arjun Arrested: పుష్ప 2 సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్న అల్లు అర్జున్ తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. అయితే ఈ సినిమా కేవలం ఆరు రోజులోనే 1000 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.మరి ఇలాంటి సందర్భంలో అల్లు అర్జున్ చేస్తున్న ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తుంది. ఆయన పాన్ ఇండియాలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక పుష్ప 2 సినిమా రిలీజ్ సమయం లో అల్లు అర్జున్ థియేటర్ కి వెళ్ళడం తో తొక్కిసలాట జరిగి రేవతి అనే ఆవిడ చనిపోయింది. ఇక దాంతో అల్లు అర్జున్ మీద కొన్ని కేసులైతే నమోదయ్యాయి… దాంతో కొద్దిసేపటి క్రితమే చిక్కడ పల్లి పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు. అయితే అల్లు అర్జున్ గత కొన్ని రోజులుగా ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక పుష్ప సినిమాతో నేషనల్ అవార్డుని గెలుచుకున్న ఆయన పాన్ ఇండియాలో తన సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
మరి ఇలాంటి సందర్భంలో అతన్ని తొక్కేయడానికి కొంతమంది చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక సమయం దొరికింది కాబట్టి అందరూ ఒకట్టై ఆయనను ఈ కేసులో ఇరికించి ఎలాగైన సరే ఆయన క్రేజ్ ను డౌన్ చేయాలనే ఉద్దేశ్యంతో ఇలాంటి ఇక చర్యలకు పాల్పడుతున్నారు అంటూ అతని అభిమానులు భారీ ఎత్తున కామెంట్లైతే చేస్తున్నారు… నిజానికి అల్లు అర్జున్ లాంటి నటుడు తనదైన రీతిలో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు వెళ్తున్నాడు.
ఇక ఇతరులతో పోటీ ఉన్నప్పటికి ఆయన ఎవరితో సంబంధం లేకుండా సింగిల్ గా ఎదుగుతూ ముందుకు సాగడం నచ్చని కొంతమంది ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అంటూ వాపోతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్నాడు. కాబట్టి ఈ కేసు విషయంలో కూడా ఆయన నిర్దోషి గా బయటికి వస్తాడు అంటూ ఆయన అభిమానులైతే కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఎవరైతే తనని తొక్కేయాలని చూస్తున్నారో వాళ్ళందరికి కూడా అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత సమాధానం చెబుతాడు అంటూ అతని అభిమానులు మీడియాలో కొన్ని వార్తలను హైలైట్ చేస్తూ వైరల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ లాంటి హీరో పుష్ప 2 సినిమాతో సక్సెస్ పార్టీ చేసుకోవాల్సింది పోయి పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ అయి కూర్చోవడం అనేది కొంతవరకు అందరికి బాధను కలిగించే విషయమనే చెప్పాలి…