Heroes using body doubles: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో క్యాలిక్యులేషన్స్ మొత్తం మారిపోయాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ టాప్ లెవెల్ ఇండస్ట్రీ గా ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…ఇండియాలో ఉన్న ప్రతి ప్రేక్షకుడిని మెప్పించే విధంగా మన హీరోలు సినిమాలను చేస్తున్నారు. ఇక ఈ కారణంతోనే మన దర్శకులు సైతం గొప్ప కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నారు. అందువల్లే డిఫరెంట్ సబ్జెక్టుల వైపు మనవాళ్లు అడుగులు వేస్తున్నారు. ఇక హీరోలు సైతం ఆ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడంతో కొంతవరకు రిస్క్ తో కూడుకున్న సన్నివేశాలను మన దర్శకులైతే చిత్రీకరిస్తున్నారు. దాంతో హీరోల డూప్ లకు సైతం డిమాండ్ ఎక్కువగా పెరిగిపోతుంది. చాలా సన్నివేశాలు వాళ్ళను పెట్టే చేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే కొంతమంది హీరోలు డూప్ లతోనే 50% సినిమా షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేస్తున్నారు. అంటే మిగిలిన 50% మాత్రమే వాళ్ళు చేస్తున్నారు. అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. నిజానికి సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రభాస్ కి డూప్ గా చేసిన కిరణ్ రాజ్ అలాగే ఎన్టీఆర్ కి డూప్ గా చేసిన అనిల్ పేర్లు బాగా వినిపిస్తున్నాయి…
బాహుబలి సమయంలో కిరణ్ రాజ్ ప్రభాస్ కి డూప్ గా చేసి గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. నిజానికి ప్రభాస్ లాంటి స్టార్ హీరోనే కిరణ్ రాజ్ ను స్టేజ్ మీదకి పిలిచి మరి పరిచయం చేశాడు. ఇలా ఏ హీరో కూడా తన డూప్ ని ప్రేక్షకులకు పరిచయం చేయడు. అసలు డూప్ ఎలా ఉంటాడో కూడా జనానికి చూపించడానికి హీరోలు ఇష్టపడరు.
ఎందుకంటే హీరోలు చేసిన దానికంటే రిస్కీ షాట్స్ మొత్తం డూపే చేస్తారు. కాబట్టి వారి మీద ఎక్కువ సింపతి పెరిగి హీరోల కంటే డూప్ లకు ఎక్కువ అభిమానులు ఏర్పడే అవకాశం ఉందనే ఉద్దేశ్యంతోనే డూపులనైతే పరిచయం చేయరు. కానీ ప్రభాస్ మాత్రం దానికి భిన్నంగా ప్రవర్తించాడు.
ఇక అనిల్ అనే వ్యక్తి ‘త్రిబుల్ ఆర్’ సినిమా సమయంలో ఎన్టీఆర్ కి డూప్ గా వ్యవహరించానని చెప్పాడు. అలాగే దేవర సినిమా సమయంలో కూడా తను డూప్ గా చేశానని తను ప్రస్తుతం ఐటీ జాబ్ చేస్తున్నానని చెప్పాడు. సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉండడం వల్ల అటు జాబ్ చేస్తూనే ఇటు సినిమా షూటింగ్లో పాల్గొంటున్నానని చెబుతున్నాడు…