https://oktelugu.com/

Chiranjeevi: సీనియర్ హీరోల్లో చిరంజీవి లో ఉన్న ప్రత్యేకత అదేనా..?అందుకే నెంబర్ వన్ హీరో అయ్యాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్(NTR), నాగేశ్వరరావు (Nagesgwara rao), కృష్ణ (Krishna), శోభన్ బాబు(Shobhan Babu) లాంటి స్టార్ హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకున్నారు. అయినప్పటికి ఇందులో ఎన్టీఆర్ మాత్రమే నెంబర్ పొజిషన్ ను దక్కించుకున్నాడు. ఆయన తర్వాత చిరంజీవి నెంబర్ వన్ పొజిషన్ కైవసం చేసుకోవడం విశేషం...

Written By: , Updated On : February 9, 2025 / 08:00 PM IST
Chiranjeevi

Chiranjeevi

Follow us on

Chiranjeevi: ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. గత 40 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న ఏకైక హీరో చిరంజీవి అనే చెప్పాలి. ఆయన మెగాస్టార్ గా మారిన తర్వాత నుంచి ఇప్పటివరకు ఎవరికీ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వరుసగా సూపర్ డూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. మరి ఆయన ఇండస్ట్రీలో ఉన్నంతకాలం వేరే ఏ హీరోకి కూడా నెంబర్ వన్ పొజిషన్ ను దక్కించుకునే అవకాశమైతే లేదు. ఇక బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలు చిరంజీవితో ఎందుకు పోటీ పడలేకపోయారు అంటే చిరంజీవి అప్పుడున్న ఆడియోన్స్ అభిరుచి మేరకు డిఫరెంట్ సినిమాలను చేస్తూ వాళ్ళను ఆకట్టుకునే ప్రయత్నమైతే చేశాడు. ఇక అలాగే మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. ఆయన సినిమాలను ఒకటికి రెండుసార్లు చూసే ఆడియన్స్ ఉండడంవల్ల ఆయన సినిమాలకు విపరీతమైన గిరాకీ ఉండేది. అందువల్లే ఆయన సినిమాలు భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను సాధిస్తూ వరుసగా ఆరు సంవత్సరాలు ఆరు ఇండస్ట్రీ హిట్లను కొట్టిన ఘనత కూడా చిరంజీవికే దక్కుతుంది. అందువల్లే ఆయనను బీట్ చేసే హీరోలు ఇండస్ట్రీలో లేకుండా పోవడం అనేది నిజంగా ఒక వంతుకు గొప్ప విషయమనే చెప్పాలి. ఇక ఆయన ఎప్పటికప్పుడు తన వ్యూహాలను మార్చుకుంటూ సూపర్ సక్సెస్ లను సాధించాడు.

అందువల్లే మెగాస్టార్ చిరంజీవి అంటే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది. ఇక 70 సంవత్సరాల వయసులో కూడా భారీ యాక్షన్ ఎపిసోడ్స్ లో పాల్గొంటూ తనకి సినిమా అంటే ఎంత ఇష్టమో తెలియజేస్తున్నాడు. మరి ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి క్రియేట్ చేస్తున్న ప్రభంజనాలు అంతా ఇంతా కాదు.

అందుకే అతన్ని వేరే ఏ హీరో కూడా బీట్ చేయలేకపోయాడు. మరి ఇప్పుడున్న జనరేషన్ లో కూడా చిరంజీవి మెగాస్టార్ గా ఉన్నాడు. మరి తన తర్వాత ఇండస్ట్రీని శాసించే హీరో ఎవరు అనే దానిమీద ఇప్పటికి సరైన క్లారిటీ అయితే రాలేదు.

ఒక రకంగా చిరంజీవి స్టామినా ఏంటో మరోసారి ఈ జనరేషన్ లో ఉన్న ప్రేక్షకులకు అభిమానులకు కూడా తెలిసేలా చేస్తుంది…చూడాలి మరి ఇక మీదట చేయబోయే సినిమాలతో ఆయన ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు. తద్వారా ఆయనకి ఎలాంటి ఇమేజ్ రాబోతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది…