Mohan Babu- Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈయన ఏదైనా సినిమా చేపట్టారు అంటే ఆ సినిమా బాక్సాఫీసు వద్ద మినిమం హిట్ గ్యారెంటీ. ఈయన దర్శకత్వంలో ఒక సినిమా చేసిన ఎంతో మంది హీరోలు ప్రస్తుతం స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు.అందుకోసమే టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్క హీరో కూడా రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని ఆశపడతారు.
ఈ సమయంలోనే మోహన్ బాబు తన కొడుకు మంచు విష్ణుతో ఒక సినిమా తీయాలని రాజమౌళిని అడిగారట. అప్పుడు రాజమౌళి టైం వస్తే తప్పకుండా తీస్తానని మోహన్ బాబు గారితో అన్నారు అలాగే ఏదో ఒక సినిమా కథతో తాను సినిమా చెయ్యలేనని చెప్పడంతో ఈ మాటకు మోహన్ బాబు కాస్తా ఫీల్ అయ్యారని, అందుకోసమే అప్పటినుంచి వీరిద్దరి మధ్య మాటలు లేవని ఈ చిన్న కారణమే వీరిని దూరం చేసిందని సమాచారం.