Prabhas Maruthi Movie: ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్నాడు.ఈ సినిమా 700 కోట్లు కలక్షన్స్ ను దాటి 800 కోట్ల కలక్షన్ల వైపు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ప్రభాస్ మరోసారి పాన్ ఇండియా లో మన సత్తా ఏంటో చూపించాడు. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం కల్కి సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందని ప్రతి ఒక్క అభిమాని కి మంచిగా కాన్ఫిడెంట్ గా ఉన్నప్పటికీ మారుతి తో చేసే సినిమా పైన మాత్రం అందరికీ డౌట్ అయితే ఉంది.
ఎందుకంటే మారుతి ఇప్పటివరకు ఏ స్టార్ హీరోతో కూడా సినిమాలు చేయలేదు వెంకటేష్ తో సినిమా చేసినప్పటికీ అది పెద్దగా సక్సెస్ సాధించలేదు మరి ఇలాంటి సమయంలో ప్రభాస్ ఇలాంటి సందర్భం లో ప్రభాస్ ఎలాంటి దైర్యం తో మారుతికి సినిమా ఇచ్చాడు అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
మారుతి సినిమా మీద ప్రభాస్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమా కామెడీ తో పాటు సస్పెన్స్ కలగలిసిన సినిమా గా రాబోతున్న సందర్భంలో ఈ సినిమా పట్ల ప్రభాస్ మంచి అంచనాలు పెట్టుకున్నట్టు గా తెలుస్తుంది. ఎందుకు అంటే చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ ఒక కామెడీ ప్రాధానమైన సినిమాలో చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇది ఇక ఉంటే కావాలనే ప్రభాస్ మారుతి ని సెలెక్ట్ చేసుకున్నట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే వరుసగా యాక్షన్, సైన్స్ ఫిక్షన్ జానర్ సినిమాలు చేస్తూ వస్తున్న ప్రభాస్ మధ్య లో ఒకటి కామెడీ సినిమా చేయాలనే ఉద్దేశ్యం తోనే సినిమాని ఎంచుకొని చేస్తున్నట్టుగా తన సన్నిహితుల ద్వారా సమాచారమైతే అందుతుంది.
మరి ఈ సినిమా ద్వారా ప్రభాస్ ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. మారుతి ప్రభాస్ కి ఎలాంటి హిట్ ఇస్తాడో తెలియాలంటే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ గానీ, టీజర్ గానీ రిలీజ్ అయితే కానీ ఈ సినిమా ఎలా ఉండబోతుందో మనకైతే తెలీదు అంటూ పలువురు సినీ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు…మారి మారుతి ప్రభాస్ తన పైన పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…