Sudigali Sudheer: బుల్లితెర మీద వచ్చే జబర్దస్త్ షో ద్వారా జనాలలో ఎక్కువగా పాపులారిటి ని సంపాదించుకున్న వాళ్ళల్లో సుడిగాలి సుదీర్ ఒకరు…నిజానికి జబర్దస్త్ లో చేసిన అందరూ టీం లీడర్ల కంటే కూడా సుదీర్ కి ఎక్కువ ఆదరణ లభించింది.ఇక అందులో భాగంగానే ఆయన వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో బిజీ హీరో గా మారిపోయాడు…అయితే ఆయన చేసిన సినిమాల్లో సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా నిరాశ పరచినప్పటికీ రీసెంట్ గా వచ్చిన గాలోడు సినిమా మాత్రం మంచి విజయాన్ని సాధించింది.
ఇక ఈ సినిమాతో ఆయన మాస్ యాంగిల్ ని కూడా టచ్ చేసి తను మాస్ హీరో గా కూడా మెప్పించగలనని నిరూపించుకున్నాడు…ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న వరుస సినిమాలో సెట్స్ మీద ఉన్నాయి.ఇక ఇదిలా ఉంటే ఆయన జబర్దస్త్ షో గాని, శ్రీదేవి డ్రామా కంపెనీ గాని అన్ని మానేసి ఓన్లీ సినిమాల్లో హీరోగా మాత్రమే చేస్తున్నాడు. అయితే ఇప్పుడు అదే సుధీర్ కి బాగా మైనస్ గా మారినట్టుగా తెలుస్తుంది…
ఎందుకంటే ఒకప్పుడు ఆయన షోస్ చేస్తూనే సినిమాల్లో కమెడియన్ గా కూడా చేసుకుంటూ వచ్చాడు.కానీ ఇప్పుడు హీరో పాత్రలకు మాత్రమే పరిమితం అవ్వడం వలన ఆయన జనాల్లో ఎక్కువగా కనిపించడం లేదు. ఒకవేళ ఆరు నెలలకు ఒక సినిమా రిలీజ్ అయినప్పటికీ ఆ సినిమా కనక ఫ్లాప్ అయినట్లయితే ఆ సినిమాల రూపం లో సుధీర్ థియేటర్లకు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆయన క్రేజ్ అనేది కొంతవరకు తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి.అలా కాకుండా కంటిన్యూస్ గా జనాల్లో కనిపిస్తూ ఉంటేనే ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు అలాగే వాళ్ళ క్రేజ్ కూడా పెరుగుతూ వస్తుంది. ఇలా గ్యాప్ ఇస్తే జనాలు మర్చిపోయే అవకాశం కూడా ఉంటుంది.
కాబట్టి సుధీర్ కొన్ని సినిమాల్లో ఇంపార్టెంట్ క్యారెక్టర్లు పోషిస్తూనే హీరో గా సినిమాలు చేసుకుంటూ వెళ్తే మంచిదని చాలామంది సినీ మేధావులు సైతం సలహాలు ఇస్తున్నారు.యంగ్ హీరోలు అయిన శ్రీ విష్ణు లాంటి హీరోలు కూడా వేరే వాళ్ల సినిమాల్లో కీలకపాత్రల్లో నటిస్తూనే ఇటు హీరో గా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. అందువల్లే వాళ్లకు మంచి విజయాలు దక్కుతున్నాయి…ఇక ఇలాంటి క్రమం లోనే హీరోగా కాకుండా మంచి క్యారెక్టర్లు దొరికినప్పుడు వేరే వాళ్ళ సినిమాల్లో కూడా నటిస్తూనే, హీరోగా కూడా చేసుకుంటే బాగుంటుందని పలువురు సుర్ అభిమానులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.
ఎందుకంటే ఇండస్ట్రీ లో సోలో హీరోగా చేస్తూ నిడదొక్కుకోవడం అంటే చాలా కష్టమైన పని. ఇక ఇప్పటికే సునీల్ లాంటి టాలెంటెడ్ నటులు కూడా అలా హీరోగా ట్రై చేసి చేతులు కాల్చుకున్నారు. దాంతో ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయాల్సి వస్తుంది…అందుకే సుధీర్ కూడా తన కెరియర్ ని బాగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్లాలని కోరుకుందాం…