Sudigali Sudheer: తెలుగు బుల్లితెర మీద సంచలనం సృష్టించిన షో ఈటీవీ ఛానల్ లో ప్రసారం అయ్యే జబర్దస్త్ కామెడీ షో..ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీ పరిచయమై నేడు టాప్ స్టార్స్ గా చలామణి అవుతున్నారు..అలాంటి కమెడియన్స్ లో ఒకరే సుడిగాలి సుధీర్..ఒక చిన్న మెజీషియన్ గా కెరీర్ ని ప్రారంబించి అనుకోకుండా జబర్దస్త్ కామెడీ షో లో వేణు వండర్స్ టీం లో నలుగురిలో ఒకడిగా కొనసాగాడు..తనలోని అద్భుతమైన కామెడీ టైమింగ్ ని పసిగట్టిన ఈటీవీ యాజమాన్యం సుధీర్ కి ప్రత్యేకంగా ఒక టీం ని మైంటైన్ చేసే అవకాశం ని కల్పించింది..ఈటీవీ వారు కల్పించిన ఈ అద్భుతమైన అవకాశం ని ఉపయోగించుకుంటూ అంచలంచలుగా ఎదిగి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు సుధీర్..నిన్న మొన్నటి వరుకు ఈటీవీ ఎంటర్టైన్మెంట్ షోస్ కి ఫేస్ లాగా నిలబడిన సుడిగాలి సుధీర్ మెల్లగా ఒక్కో ఎంటర్టైన్మెంట్ షో ని వదిలేయడం ప్రారంబించాడు..ముందుగా ఢీ షో మానేసాడు..ఈ షో లో కంటెస్టెంట్స్ చేసే డాన్స్ పెర్ఫార్మన్స్ ని చూసే వారి సంఖ్య కంటే..డాన్స్ మధ్యలో వచ్చే సుడిగాలి సుధీర్ కామెడీ స్కిట్స్ కోసం ఈ షో ని చూసే వారి సంఖ్య ఎక్కువ..తన కామెడీ టైమింగ్ తో అలాంటి బ్రాండ్ ఇమేజి ని సొంతం చేసుకున్నాడు సుధీర్..ఆయన ఢీ మానేసినప్పటి నుండి ఆ షో కి కళ పోవడమే కాదు..TRP రేటింగ్స్ కూడా దారుణంగా పడిపోయాయి.

ఢీ షో మానేసినప్పటికీ జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ తో కొనసాగాడు సుధీర్..కానీ ఇటీవల కాలం లో ఆ షోస్ లో కూడా ఆయన కనపడడం లేదు..సడన్ గా సుధీర్ ఏమైయ్యాడు కనపడడం లేదు అని ఆయన అభిమానులు చాలానే మిస్ అయ్యారు..సినిమాల్లో అవకాశాలు వరుసగా రావడం వల్లే సుధీర్ జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ ని వదిలేసాడు అని అందరూ అనుకున్నారు..ప్రస్తుతం ఆయన హీరో గా నాలుగు సినిమాల్లో నటిస్తున్నాడు..అందులో రెండు విడుదలకి సిద్ధం గా ఉన్నాయి..వీటితో పాటు కమెడియన్ గా కూడా ఆయనకీ టాలీవుడ్ లో మంచి అవకాశాలే వస్తున్నాయి..దీనితో ఆయన ఫుల్లుగా బిజీ అవ్వడం వల్లే ఈటీవీ కి దూరమైనాడు అని అందరూ అనుకున్నారు..కానీ సుధీర్ మాటీవీ లో ప్రసారం అయ్యే ‘సూపర్ సింగర్ జూనియర్’ అనే షో కి వ్యాఖ్యాతగా వ్యవహరించడం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ కి గురి అయ్యారు.

Also Read: Virata Parvam First Review: విరాట పర్వం మూవీ మొట్టమొదటి రివ్యూ
‘అదేంటి సినిమాల్లో బిజీ గా ఉంటూ బుల్లితెర కి దూరం అవుతున్నాడు అనుకుంటే..మళ్ళీ ఇక్కడ దర్శనమిచ్చాడు ఏంటి’ అని ఆయన అభిమానులంతా ఆశ్చర్యానికి గురైయ్యారు..సుధీర్ సినిమాల్లో బిజీ అవ్వడం వల్ల ఈటీవీ లో ఆయన చేస్తున్న షోస్ అన్ని వదులుకోవాల్సి రావడం లో ఎలాంటి అబద్దం లేదు..కానీ ఆయన ఈ షోస్ మానేయడానికి కూడా మరొక కారణం ఉంది..మాటీవీ నుండి సుధీర్ కి పలు ఎంటెర్టైమెంట్ షోస్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించడం కోసం భారీ ఎత్తున్న పారితోషికం ని ఆఫర్ చేశారట..కానీ ఈటీవీ యాజమాన్యం మాటీవీ ఇచ్చేంత రెమ్యూనరేషన్ మేము ఇవ్వలేము అని సుధీర్ కి చెప్పడం తో ఆయన ఈ షోస్ ని వదులుకోవాల్సి వచ్చింది..అలా వదులుకొని సుధీర్ తప్పు చేశాడా..? అని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న మాట..ఎందుకంటే ఈటీవీ లో ప్రతి వారం ప్రసారం అయ్యే షోస్ తో ప్రతి తెలుగింటివారికి దగ్గరయ్యాడు సుధీర్..ఇప్పుడు ఆ షోస్ అన్ని మానేయడం తో సుధీర్ అభిమానులకు దూరం అవుతున్నాడా అనే సందేహాలు ప్రారంభం అయ్యాయి..మళ్ళీ సుధీర్ ఈటీవీ ఎంటర్టైన్మెంట్ షోస్ లో రీ ఎంట్రీ ఇవ్వాలని ఆయన అభిమానులు బలంగా కోరుకుంటున్నారు..చూడాలిమరి అభిమానుల కోరికను సుధీర్ నెరవేరుస్తాడో లేదో అనేది.

Also Read: Agneepath Scheme: ‘అగ్నిపథ్’పై మిశ్రమ స్పందన.. తప్పుపడుతున్న రక్షణరంగ నిపుణులు
Recommended Videos
[…] Also Read: Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ పెద్ద పొరపాటు … […]
[…] Also Read:Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ పెద్ద పొరపాటు … […]