Allu Arjun Sneha Reddy Love Story: ఒక మనిషికి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించిన నటుడు అల్లు అర్జున్… కెరియర్ మొదట్లో నటన పరంగా కొన్ని విమర్శలను ఎదుర్కొన్నప్పటికి ఆ తర్వాత ఆయన చేసిన సినిమాలన్నింటితో గొప్ప విజయాలను సాధించాడు. ఇప్పుడు ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ హీరోగా ఎదిగాడు. నేషనల్ అవార్డుని కూడా అందుకున్నాడు. అలాంటి నటుడు సినిమాలపరంగా చాలా కష్టపడుతుంటాడు. ఇక అలాంటి నటుడి సక్సెస్ స్టోరీ వెనుక తన భార్య అయిన స్నేహారెడ్డి కూడా ఉందనే విషయాన్ని పలు సందర్భాల్లో తెలియజేశాడు. నిజానికి అల్లు అర్జున్ మొదట్లో వేరే అమ్మాయిని లవ్ చేశాడట. ఇక ఆ అమ్మాయిని ప్రేమించే క్రమంలో తనకు స్నేహ రెడ్డితో పరిచయం ఏర్పడి స్నేహ రెడ్డి తన మీద తీసుకుంటున్న కేర్ ని చూసి డైరెక్ట్ గా తనని పెళ్లి చేసుకుంటానని చెప్పాడట. దాంతో అర్జున్ స్నేహ రెడ్డి ఇద్దరూ కొద్దిరోజులు ప్రేమించుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. నిజానికి అల్లు అర్జున్ స్నేహ రెడ్డిని పెళ్లి చేసుకోవడం నిజంగా తన అదృష్టమనే చెప్పాలి.
ఆయనకు ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాతే సక్సెస్ లు వచ్చాయి. అలాగే తన కెరీర్ కూడా ఒక గైడెన్సీ లో ముందుకు వెళ్తుంది. నిజానికి అల్లు అర్జున్ మొదట లవ్ చేసిన అమ్మాయి ఎవరు అంటే వాళ్ళ రిలేషన్స్ లోనే ఒక అమ్మాయి అని తెలుస్తుంది.
మొదట్లో ఆమె ను చాలా ఘాడంగా ప్రేమించాడట. అల్లు అర్జున్ ఆ విషయాన్ని ఆ అమ్మాయికి ఎప్పుడు చెప్పలేదట. ఇక ఈ ప్రాసెస్ లోనే తను స్నేహ రెడ్డిని కలవడంతో తన మంచితనానికి మంత్ర ముగ్ధుడైపోయిన అల్లు అర్జున్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
ఇక ఏది ఏమైనా కూడా అల్లు అర్జున్ కెరీర్లో ముందుకు దూసుకెళ్తున్నాడు అంటే దానికి మూల కారణం స్నేహ రెడ్డి అనే చెప్పాలి. తను ఏ సినిమా చేయాలి అనేది కూడా ప్రస్తుతం స్నేహ రెడ్డినే చూసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. పుష్ప తర్వాత పాన్ ఇండియా హీరోగా మారిన అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ వరల్డ్ ఇండస్ట్రీకి దూసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తున్నాడు…