Shyam Singa Roy: న్యాచురల్ స్టార్ నాని తాజా చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన ‘శ్యాం సింగ రాయ్’ పాజిటివ్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ హిట్ దిశగా దూసుకెళుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదలకు ముందే 20కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక తొలి మూడు రోజుల్లో ఈ చిత్రం అన్ని ఏరియాల్లో కలిపి 16కోట్ల మేర వసూళ్లను రాబట్టి నాని బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో చూపించాడు.
‘శ్యామ్ సింగ రాయ్’ కు ముందు నాని నటించిన ‘టక్ జగదీష్’, ‘వీ’ వంటి చిత్రాలు ఓటీటీలో విడుదలయ్యాయి. అయితే వీటికి పెద్దగా ఆదరణ లభించలేదు. మరోవైపు నాని సినిమాలు థియేటర్లలో రాకపోవడంతో అభిమానులు కొంత నిరుత్సాహం చెందారు. ఇలాంటి సమయంలో నాని ‘శ్యాం సింగ రాయ్’తో థియేటర్ల ముందుకొచ్చి ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు.
Also Read: ‘శ్యామ్ సింగరాయ్’ 4 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ !
క్రిస్మస్ కానుకగా రిలీజైన ‘శ్యాం సింగ రాయ్’ తొలి మూడు రోజుల్లోనే 16కోట్ల మేర వసూళ్ల చేసింది. దీంతో ఈ చిత్రం బ్రేక్ ఈవెంట్ సాధించడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చని తెలుస్తోంది. మొత్తంగా నాని కెరీర్లో ‘శ్యాం సింగ రాయ్’ ఒక కీలక చిత్రంగా మిగిలిపోవడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
‘శ్యాం సింగ రాయ్’ విడుదలైన రోజు నుంచే సినిమాకు పాజిటివ్ టాక్ లభించింది. దీంతో ఈ మూవీకి కలెక్షన్లు ఆశాజనకంగా వస్తున్నారు. నైజాం ఏరయాలో ఈ సినిమా బాగా ఫార్ఫమ్ చేస్తోంది. ఈ ఏరియాలో మూడురోజుల్లోనే 8.5కోట్ల గ్రాస్, ఐదు కోట్ల షేర్ ను రాబట్టింది. అలాగే సీడెడ్లో కోటిన్నర, ఆంధ్రాలోని మిగిలిన ఏరియాలన్నీ కలిపి నాలుగు కోట్ల పైచిలుకు షేర్ ను రాబట్టింది.
ఏపీ, తెలంగాణలో కలిపి ఈ మూవీ రూ.16కోట్ల మేరకు షేర్ ను కలెక్ట్ చేసింది. యూఎస్ లోనూ మిలియన్ డాలర్ల మార్క్ ను టచ్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే రూ.24కోట్ల మేర గ్రాస్, 14కోట్ల షేర్ ను రాబట్టిందని సమాచారం. వీకెండ్లో ఈ మూవీకి మరిన్ని కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టడం గ్యారంటీ అని తేలిపోయింది.
ఇదిలా ఉంటే ‘శ్యాం సింగ రాయ్’ మొదటి రోజు కంటే రెండోరోజు ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమాల జాబితాలో ‘శ్యాం సింగ రాయ్’ నాలుగో స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ఈ మూవీలో నానికి జోడీగా ‘ఫిదా’ బ్యూటీ సాయి పల్లవి, ‘ఉప్పెన’ హీరోయిన్ కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ నటించారు. ఈమూవీని రాహుల్ సంకృత్యన్ సినిమాను తెరకెక్కించగా మిక్కిజే మేయర్ సంగీతం అందించాడు.
Also Read: ‘పుష్ప’ లేటెస్ట్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ !