Nayanthara- Vignesh: సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవలే కవల పిల్లలకు జన్మని ఇచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..నాలుగు నెలల క్రితం తన ప్రియుడు విగ్నేష్ ని పెళ్లాడిన ఈమెకి అప్పుడే పిల్లలు పుట్టడం ఇప్పుడు సెన్సషనల్ టాపిక్ గా మారిన అంశం..నయనతార ఇటీవల కాలం లో చాలా సందర్భాలలో మీడియా కి కనిపించారు..ఎప్పుడు కూడా ఆమె గర్భం దాల్చినట్టు మనకి కనిపించలేదు..రెండు నెలల క్రితం ఆమె తన భర్త విగ్నేష్ తో కలిసి హనీమూన్ కి వెళ్ళింది..ఆ ఫోటోలు కూడా సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి..కానీ ఎక్కడా కూడా నయనతార గర్భం దాల్చినట్టు దాఖలాలు లేవు..హనీమూన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఆమె సినిమా షూటింగ్స్ లో పాల్గొన్నది..పోనీ వీళ్లిద్దరు డేటింగ్ సమయం లో కలవడం వల్ల అప్పటి నుండే ప్రెగ్నన్సీ వచ్చిందా అంటే అది కూడా లేదు..అదే కనుక జరిగి ఉంటె నయనతార పెళ్లి సమయానికి ఆమెకి 5 నెలల గర్భం ఉండాలి..కానీ లేదు.

అదేమీ లేకుండా ఏకంగా నాలుగు నెలల్లో కవల పిల్లలకు జన్మనిచ్చాము అంటూ ఈ దంపతులిద్దరూ చెప్పడం అనేక వివాదాలకు దారి తీసింది..అయితే వీళ్లిద్దరికీ పిల్లలు సరోగసి ప్రక్రియ ద్వారా పిల్లలు పుట్టినట్టు కోలీవుడ్ మొత్తం మారుమోగిపోతున్న వార్త..సరోగసి ప్రక్రియ అంటే వేరే స్త్రీ గర్భం లో వీర్యకణాలు పంపించి సంతానం పొందడం..అంటే అద్దె గర్భం అన్నమాట..ఈ ప్రక్రియ మన దేశం లో ప్రస్తుతం బ్యాన్ చేసింది భారత దేశ ప్రభుత్వం..కేవలం ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రమే ఈ ప్రక్రియ కి అర్హులు..ఇప్పుడు నయనతార దంపతులకు సంతానం కూడా ఈ ప్రక్రియ ద్వారానే కలిగింది అనే విషయం స్పష్టం గా అర్థమైపోతుంది..దీనిపై వివరణ ఇవ్వాలంటూ తమిళనాడు ప్రభుత్వం కూడా నయనతార దంపతులకు ఆదేశాలు జారీ చేసింది..ఇక సరోగసి ప్రక్రియ ని నయనతార తన ప్రాణ స్నేహితురాలిపైనే ప్రయోగించింది అట.

నయనతార ప్రస్తుతం కెరీర్ పరంగా పీక్ స్థానం లో ఉంది..ఇప్పుడు పిల్లల్ని కంటే అందం కోల్పోయ్యే ప్రమాదం ఉంది..అందుకే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది..తన స్నేహితురాలే నయనతార పరిస్థితి ని అర్థం చేసుకొని ఆ సలహా ఇచ్చి, సరోగసి ప్రయోగం చేయించుకొని అద్దె తల్లి గా మారింది అని కోలీవుడ్ లో ఒక వార్త జోరుగా సాగుతుంది..కానీ చట్టరీత్య ఇది చాలా నేరం..ప్రభుత్వ విచారణ లో ఇది నిజం అని తేలితే నయనతార దంపతులకు శిక్ష పడే అవకాశాలు కూడా ఉన్నాయి.